hyderabadupdates.com movies డిజాస్టర్ సినిమాకు ఇంత హడావిడి ఏమిటో

డిజాస్టర్ సినిమాకు ఇంత హడావిడి ఏమిటో

అతి చెయ్ కానీ మితంగా చెయ్ అని పెద్దలు ఊరికే అనలేదు. సూర్య కెరీర్ ని రివర్స్ లో కిందకు తీసుకెళ్లిన సినిమాగా అంజాన్ (తెలుగులో సికందర్)ని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. పందెం కోడి దర్శకుడు తమకు బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకం నిలువునా నీరుగారిపోవడం డిజాస్టర్ సాక్షిగా రుజువయ్యింది. దీన్ని రీ ఎడిట్ చేసి, సీన్లు అటు ఇటు మార్చి, కమెడియన్ సూరి ట్రాక్స్ మొత్తం లేపేసి ఫ్రెష్ గా రీ రిలీజ్ చేశారు. డైరెక్టర్ లింగుస్వామి ఇదేదో కొత్త సినిమా అన్న రేంజ్ లో హడావుడి చేశారు. ఫ్లాప్ చేయడం ప్రేక్షకుల తప్పని, క్రిటిక్స్ వల్లే డిజాస్టర్ అయ్యిందనే రీతిలో ఇంటర్వ్యూలలో ఏదేదో మాట్లాడేశారు.

కొందరు ఫ్యాన్స్ కోసం స్పెషల్ ప్రీమియర్ వేసి సోషల్ మీడియాలో ట్వీట్లు వేయించారు. ఇంత జరిగిన తర్వాత ఇవాళ ఉదయం తమిళనాడులో చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఓటిటి సంస్థ అభ్యంతరం చెప్పడం వల్లని ఒక వార్త, ఆర్థికపరమైన కారణాల వల్లని మరో న్యూస్ ఇలా ఏవేవో చెన్నై సర్కిల్స్ లో చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు మధ్యాహ్నం తర్వాత ఇష్యూస్ క్లియర్ చేసి షోలు వేశారు. జనం ఎగబడి చూస్తారని భావించిన నిర్మాతలకు షాక్ తగిలేలా ఉంది. బుక్ మై షో ట్రెండింగ్ లోకి రాలేదంటే జనంలో దీని పట్ల కనీస ఆసక్తి లేదని అర్థం చేసుకోవచ్చు. అయినా సరే ప్రొడ్యూసర్ల ధీమా ఏంటో మరి.

సికందర్ ఒకటే కాదు ఏ డిజాస్టర్ అయినా ఎప్పటికీ రిజల్ట్ ని మార్చుకోలేదు. ఆరంజ్ పాటలను థియేటర్ లో విపరీతంగా ఎంజాయ్ చేసిన యూత్ లో అధిక శాతం మిగిలిన సినిమాను అంతగా ఇష్టపడరనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఫ్లాపులను ఎడిటింగ్ చేసి కొంత మార్చినంత మాత్రం అబ్బో ఇప్పుడు సినిమా భలే ఉందని ఎవరూ అనరు. లింగుస్వామి ఇంతగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కారణం ఉంది. ప్రస్తుతం ఆయనకు స్టార్ హీరోలు స్పందించడం లేదు. మన రామ్ గుడ్డిగా నమ్మి ఓకే చేస్తే వారియర్ రూపంలో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చారు. అలాంటిది ఎవరైనా ఇప్పుడు ఆయన మీద కోట్ల రూపాయలు పెట్టే రిస్క్ ఎందుకు తీసుకుంటారు.

Related Post

Rashmika Mandanna’s “Laayi Le” Song from The Girlfriend Steals HeartsRashmika Mandanna’s “Laayi Le” Song from The Girlfriend Steals Hearts

National Crush Rashmika Mandanna is once again winning hearts with her upcoming film The Girlfriend. Starring opposite talented actor Dheekshith Shetty, this romantic drama is gearing up for a grand

మీడియాను ఆకాశానికెత్తేసిన‌ బండ్ల గ‌ణేష్మీడియాను ఆకాశానికెత్తేసిన‌ బండ్ల గ‌ణేష్

న‌టుడు, నిర్మాత‌ బండ్ల గణేష్ చేతికి మైక్ అందితే చాలు.. అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపు తిప్పుకుంటాడు. ఆయ‌న ఎవ‌రిఐనా పొగిడినా, తెగిడినా అది టాప్ గేర్‌లోనే ఉంటుంది. గ‌త నెల లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చి ఆ టీం

దేశంలో ఫ‌స్ట్‌: ఐసీయూలో పెళ్లి.. ఇదో చిత్ర‌మైన వివాహం!దేశంలో ఫ‌స్ట్‌: ఐసీయూలో పెళ్లి.. ఇదో చిత్ర‌మైన వివాహం!

ఎక్క‌డైనా భారీ వేదిక‌ల‌పై పెళ్లి జ‌ర‌గ‌డం తెలుసు. లేదా.. గుడిలో పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం కూడా తెలిసిందే. లేదా.. ఇళ్ల వద్దే భారీ ఖ‌ర్చుల‌తో లేదా సింపుల్‌గా అయినా.. పెళ్లిళ్లు చేసుకున్న ఘ‌ట‌న‌లు మ‌న‌కు తెలిసిందే. అయితే.. దేశంలో తొలిసారి ఐసీయూలో పెళ్లి