hyderabadupdates.com movies డిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూ

డిసెంబర్ 12 – పోటీ గట్టిగానే ఉంది గురూ

మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి, దురంధర్ ఏదో నెట్టుకొస్తున్నాయి కానీ చాలా స్క్రీన్లు తాత్కాలికంగా మూసేయాల్సి వచ్చింది. ఫీడింగ్ కోసం తేరే ఇష్క్ మే డబ్బింగ్ వెర్షన్ అమర కావ్యంకి షోలు పెంచినప్పటికీ అసలది వచ్చిన సంగతే చాలా మంది ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు అందరి కన్ను డిసెంబర్ 12 మీదకు వెళ్తోంది. ఎందుకంటే చెప్పుకోదగ్గ స్థాయిలో కంటెంట్ ఉన్న సినిమాలు పోటీకి దిగుతున్నాయి. కౌంట్ పైకి ఎనిమిది దాకా కనిపిస్తోంది కానీ బజ్ పరంగా చూసుకుంటే నాలుగే హైలైట్ అవుతున్నాయి.

కార్తీ ‘అన్నగారు వస్తారు’గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి కూడా ఆర్థిక సమస్యల వల్ల పోస్ట్ పోన్ కావొచ్చనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు వాటిని ఖండిస్తూ ప్రమోషన్లు యథావిధిగా కొనసాగిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా కార్తీ ఇందులో వినోదాత్మక పాత్రను పోషించాడు. సురేష్ సంస్థ భాగస్వామి కావడం వల్ల ‘సైక్ సిద్దార్థ్’ మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. హీరో నందు గ్యారెంటీగా మెప్పిస్తానని హామీ ఇస్తున్నాడు. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన ‘మోగ్లీ’ మీద హీరోగా నటించిన సుమ కొడుకు రోషన్ కనకాల బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. పబ్లిసిటీ అయితే మొదలయ్యింది కానీ జనానికిఇంకా రీచవ్వాలి.

బన్నీ వాస్, వంశీ నందిపాటి, దామోదర్ ప్రసాద్ సంయుక్తంగా అందిస్తున్న హారర్ మూవీ ‘ఈషా’ మీద క్రమంగా ఆసక్తి పెరిగేలా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. స్టార్లు లేరు కాబట్టి కంటెంట్ మీదే ఆధారపడ్డారు. ఇవి కాకుండా ఘంటసాల, మిస్టీరియస్, నా తెలుగోడు, ఇట్స్ ఓకే గురు అనే మరో నాలుగు సినిమాలు పోటీలో ఉన్నాయి. వీటికి అద్భుతమైన టాక్ వస్తేనే నిలబడతాయి. అఖండ 2 ఈ వారం వస్తుందో రాదో ఇంకా అయోమయం తీరని నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ చెప్పిన సినిమాలు డిసెంబర్ 12కే కట్టుబడ్డాయి. చివరి నిమిషంలో ఏమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఈ వరుసలో మార్పుండదు.

Related Post

9 South movies releasing in theaters this week: Vidhrohi to Mathew Thomas’ Nellikkampoyil Night Riders9 South movies releasing in theaters this week: Vidhrohi to Mathew Thomas’ Nellikkampoyil Night Riders

Cast: Mathew Thomas, Roshan Shanavas, Sarath Sabha, Merin Philip, Meenakshi Unnikrishnan, Rony David, Abu Salim Director: Noufal Abdullah Language: Malayalam Genre: Fantasy Horror Comedy Thriller Runtime: 2 hours and 5