hyderabadupdates.com Gallery డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్ post thumbnail image

అమ‌రావ‌తి : ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందిస్తున్నామని తెలిపారు. వాట్సప్ గవర్నెన్సు సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వాట్సప్ గవర్నెన్స్ సేవల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఎం కు తెలిపారు.
ఇప్పటి వరకూ 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్సు సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించామని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఏర్నాటు చేస్తున్న డ్రోన్ సిటీ ఫేజ్ 1 అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయ్యిందని, మే నెల రెండో వారంలో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయని ముఖ్యమంత్రికి వివరించారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యిందని అధికారులు ఇచ్చిన వివరణ పై స్పందించిన సీఎం… ఈ ఏడాది జూలై నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
The post డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎంక‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదిలా ఉండ‌గా జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న వన్ మంత్… వన్ విలేజ్… ఫోర్

జర్నలిస్టులపై అప్రకటిత సెన్సార్‌షిప్ త‌గ‌దుజర్నలిస్టులపై అప్రకటిత సెన్సార్‌షిప్ త‌గ‌దు

అమరావతి : జర్నలిస్టులు, స్వతంత్ర డిజిటల్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులు, వ్యంగ్య రచయితలు, స్టాండప్ కమేడియన్లు,

Anmol Bishnoi: భారత్ కు గ్యాంగ్‌ స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్Anmol Bishnoi: భారత్ కు గ్యాంగ్‌ స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్

    మహారాష్ట్ర ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణో య్‌ను అమెరికా నుంచి రప్పిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద ఏప్రిల్‌ 2024లో జరిగిన