hyderabadupdates.com movies డ్యూడ్ హీరో క్రేజుని వాడుకోవడం లేదా

డ్యూడ్ హీరో క్రేజుని వాడుకోవడం లేదా

ఇప్పుడు దక్షిణాది హీరోల్లో యూత్ పరంగా మంచి డిమాండ్ ఉన్న వాళ్లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రదీప్ రంగనాథన్. మీరు హీరో మెటీరియల్ కాదు కదా అని ఒక జర్నలిస్టు అడిగినా నవ్వుతూ హిట్టుతోనే సక్సెస్ కొట్టిన ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ ఇలా వరుసగా మూడు సూపర్ హిట్లే కాదు మూడు వంద కోట్ల బొమ్మలు ఖాతాలో వేసుకోవడంతో డిమాండ్ మాములుగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి, ధనుష్ తర్వాత ఆ స్థానాన్ని తీసుకునేది ప్రదీప్ రంగనాధన్ అనేది అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇంత డిమాండ్ ఉందంటే మాటలా.

తన కొత్త సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18 విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు ఎప్పుడో ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడా డేట్ కు రావడం అనుమానమేనని చెన్నై టాక్. డ్యూడ్ కన్నా చాలా ముందు మొదలై షూటింగ్ ఆలస్యమవుతూ పలు వాయిదాలు వేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాక మళ్ళీ పోస్ట్ పోన్ అంటే విచిత్రమే. ఇంకా ఓటిటి డీల్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్లే లేటవుతోందని యూనిట్ టాక్. ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఫాంటసీ డ్రామాలో ఎస్జె సూర్య చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. హైలైట్స్ లో ఒకటిగా ఆయన్ని చెబుతున్నారు.

ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ దర్శకుడు విగ్నేష్ శివన్. నయనతార భర్తగా వెంటనే గుర్తు పడతాం కానీ ఒకప్పుడు మంచి హిట్లతో ట్రాక్ రికార్డు బాగానే ఉండేది. సూర్య లాంటి స్టార్లతో కూడా పని చేశాడు. అయితే ప్రదీప్ రంగనాథన్ లాంటి హాట్ కేక్ హీరోని చేతిలో పెట్టుకుని ఇంత జాప్యం చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. పైగా దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఈపాటికి బిజినెస్ అయిపోయి ఉండాలి. కానీ ఇలా మీనమేషాలు లెక్కేసుకుంటూ ఉంటే సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ తగ్గిపోతుంది. అది జరగకూడదనే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి టీమ్ మాటకు కట్టుబడి ఉంటుందో లేదో చూడాలి.

Related Post

సంక్రాంతి పంచాయితీ.. మళ్లీ మొదలుసంక్రాంతి పంచాయితీ.. మళ్లీ మొదలు

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే సీజన్ అయిన సంక్రాంతికి అంతిమంగా వచ్చే సినిమాలేవి.. రేసు నుంచి తప్పుకునేవి ఏవి అనే చర్చ ప్రతిసారీ ఉండేదే. ఈ విషయంలో చివరి వరకు సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. కొన్ని చిత్రాలు మొదట్నుంచి పోటీలో ఉండి