హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నానని నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఒక బాధ్యత కలిగిన పదవులలో ఉన్న మీరంతా ఆధారాలు లేకుండా ఎలా కామెంట్స్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్. దమ్ముంటే మీలో ఖలేజా అనేది ఉంటే తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు.
ఉగాది సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తనపై లేకి కామెంట్స్ చేసిన మీరంతా డ్రగ్స్ టెస్టులకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. ఆ దమ్ము మీలో ఉందా అని ఫైర్ అయ్యారు కేటీఆర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నట్లుందని అన్నారు. ఆయన విషయంలో మేం ఎలాంటి చర్చలు చేయ లేదని చెప్పారు మాజీ మంత్రి.
మమ్మల్ని తట్టుకోవడమే సర్కార్ వల్ల కావడం లేదని, వాళ్లకు కేసీఆర్ ఎందుకు కావాలని ప్రశ్నించారు. నిషేధిత భూములపై మంత్రి పొంగులేటి ఎందుకు నోరు మెదపట్లేదని నిప్పులు చెరిగారు కేటీఆర్. కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని అన్నారు. పొంగులేటి కొడుకు కబ్జాలు చేస్తే అక్కడున్న ఆఫీసర్‌ను ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు.
The post డ్రగ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
డ్రగ్ టెస్టుకు నేను సిద్దం మీరు రెడీనా..?
Categories: