hyderabadupdates.com movies డ్ర‌గ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

డ్ర‌గ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం.. బీజేపీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శ‌నివారం సాయంత్రం జ‌రిపిన దాడిలో సుధీర్ రెడ్డి స‌హా ఆయ‌న స్నేహితు లు డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్టు గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ వెంట‌నే డ్ర‌గ్స్ టెస్ట్ చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఎమ్మెల్యే కుమారుడిపైనా.. ఆయ‌న స్నేహితుల‌పైనా కేసులు న‌మోదు చేశారు. అనంత‌రం.. వారిని డీ అడిక్ష‌న్ కేంద్రానికి త‌ర‌లించారు.

హుటాహుటిన‌..

త‌న కుమారుడి అరెస్టు విష‌యం తెలుసుకున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి హుటాహుటిన హైద‌రాబాద్‌కు వెళ్లారు. త‌న కుమారుడికి ఎలాంటి చెడు అల‌వాట్లు లేవ‌ని.. ఈ కేసులో అన్యాయంగా ఇరుక్కున్నాడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.

అయితే.. పోలీసులు ఎమ్మెల్యే వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాల‌ని చెప్ప‌డంతో ఆయ‌న సైలెంట్ అయ్యారు. మ‌రోవైపు నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లోనూ భారీ ఎత్తున డ్ర‌గ్స్ తీసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌..వారిని క్ల‌బ్బు నిర్వాహ‌కుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ కేంద్రంగా డ్ర‌గ్స్ ర‌వాణా.. వినియోగం పెరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అవుతున్నారు. `ఈగ‌ల్`విభాగాన్ని ఏర్పాటు చేసి డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సుధీర్ రెడ్డి ఉదంతంతో రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర అల‌జ‌డి రేగింది.

ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డికి అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీ నాయ‌కుల‌తోనూ అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే.. డ్ర‌గ్స్ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్రం కూడా సీరియ‌స్‌గా తీసుకుంటున్న నేప‌థ్యం లో ఆయ‌న ఈ విష‌యంలో ఏ చేయాలో పాలుపోక‌.. స‌త‌మ‌తం అవుతున్నారు.

Related Post

వార్ ఎఫెక్ట్… వంటింట్లో బాదుడే బాదుడువార్ ఎఫెక్ట్… వంటింట్లో బాదుడే బాదుడు

యుద్ధం.. అక్కడి వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపితే.. మనపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు. పెరుగుతాయని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. అయితే రాత్రికి రాత్రే గ్యాస్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు

5 Mammootty films going on floors in 2026: Khalid Rahman’s Mattancherry Mafia, D55 and more5 Mammootty films going on floors in 2026: Khalid Rahman’s Mattancherry Mafia, D55 and more

Initially, Marco producers Cubes Entertainment had announced a project starring Mammootty and directed by Khalid Rahman. However, the producers later opted out. Despite this, a film featuring Mammootty and Khalid

ప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయప్యారడైజ్ గుమ్మడికాయ… రోమియో కొబ్బరికాయ

మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా లేదానే అనుమానాలు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వదిలిన హీరోయిన్ కయదు లోహర్ బర్త్ డే పోస్టర్లో మరోసారి తేదీని