చెన్నై : తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యాడు టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ అలియాస్ జోసెఫ్ విజయ్. తాజాగా అన్ని ప్రధాన పార్టీలకు కోలుకోలేని ఝలక్ ఇచ్చాడు. ఏకంగా రాష్ట్రంలోని 234 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి టీవీకే పార్టీ తరపున అభ్యర్థులను ఖరారు చేశాడు విజయ్. రాష్ట్ర ఎన్నికల్లో జాబితాను ప్రకటించిన ఏకైక పార్టీ ఇదే కావడం విశేషం. ఈ తరుణంలో ఆయన పార్టీ కోసం పని చేస్తున్న వారిని, ముందు నుంచి తనను నమ్ముకున్న వారికి ప్రయారిటీ ఇచ్చాడు ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి.
ఇదిలా ఉండగా విజయ్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ జాబితాలో తనతో కొన్నేళ్ల పాటు ఉంటూ , తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి కొడుక్కి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సందర్బంగా తను చదువుకునేందుకు తన తండ్రి ఎంతో కష్ట పడ్డాడని తెలిపాడు విరుగుంబాక్కం టీవీకే అభ్యర్థి, 30 ఏళ్ల ఆర్. శబరినాథన్ . ఒక సామాన్యుడి నుండి రాజకీయ నాయకుడిగా తన ప్రయాణానికి ఇది ఒక పరిపూర్ణమైన ఆరంభం అని పేర్కొన్నాడు. శబరినాథన్ కన్నీళ్లు పెట్టుకోగా, నటుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ స్వయంగా అతని కన్నీళ్లను తుడిచి, కౌగిలించుకున్న సహజమైన, భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.
The post డ్రైవర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైరల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
డ్రైవర్ కొడుక్కి టీవీకే అసెంబ్లీ టికెట్ వైరల్
Categories: