hyderabadupdates.com movies ఢిల్లీకి స్టూడెంట్స్.. సింగపూర్కు టీచర్లు.. వాహ్ లోకేష్

ఢిల్లీకి స్టూడెంట్స్.. సింగపూర్కు టీచర్లు.. వాహ్ లోకేష్

ఏపీ లోని ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుడ్న్యూస్ చెప్పారు. అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈనెల 27నుంచి డిసెంబర్ 2వతేదీ వరకు వారంరోజుల పాటు ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ లోని ప్రముఖ స్కూళ్లను సందర్శించాలి, అక్కడి అధునాతన సాంకేతికలతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, క్లాసు రూముల్లో వాతావరణం తదితరాలపై పూర్తిస్థాయి అధ్యయనంచేసి, రాష్ట్రంలో విద్యాప్రమాణాల మెరుగుకు మనం ఏం చేయగలమో నివేదిక రూపంలో అందజేయాలని అన్నారు.  ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్, సింగపూర్‌లలో అధ్యయనానికి పంపించాలని గతంలో ఆయన సీఎం చంద్రబాబును కోరారు. ఇది కార్యరూపం దాల్చింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సుమారు 100 మంది నిన్న విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వీరంతా అక్కడ నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్కల్చర్‌ను సందర్శిస్తారు.  రెండు రోజుల టూర్‌లో భాగంగా వారికి సైన్స్, టెక్నాలజీల మీద ప్రాక్టికల్ అవగాహన పెరగనుందని అధికారులు చెబుతున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ విద్యా యాత్ర ద్వారా విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలపై ప్రాయోగిక అవగాహన పెంపొందించుకునే అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులందరూ సురక్షితంగా ప్రయాణం చేయాలని, ఈ యాత్ర ద్వారా కొత్త జ్ఞానం, అనుభవాలు సంపాదించి తిరిగి రావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Related Post

Premante Trailer: Priyadarshi & Anandhi starrer promises fun, thrills, & romancePremante Trailer: Priyadarshi & Anandhi starrer promises fun, thrills, & romance

Priyadarshi is set to entertain audiences with the romantic comedy film, Premante, backed by Rana Daggubati, Puskur Ram Mohan Rao, and Jhanvi Narang. Anandhi plays the female lead, and the