hyderabadupdates.com movies ఢిల్లీలో 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణం అదే!

ఢిల్లీలో 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణం అదే!

ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. ఏక్యూఐ 359తో ప్రమాదకర స్థాయికి చేరగా, అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం పెరగడంతో కేంద్రం జీఆర్ పీఏ స్టేజ్-4 చర్యలను స్టేజ్-3లోనే అమలు చేయాలని సూచించింది. ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి, మిగతావారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఏక్యూఐ.. ఆనంద్ విహార్ లో 422, అశోక్ విహార్ లో 403, బావనలో 419, నోయిడా సెక్టార్ లో 125 – 434 ఉంది.

తీవ్ర కాలుష్యం కారణంగా పాఠశాలలకు ఆరుబయట కార్యక్రమాలు నిలిపేయాలని సూచనలు జారీ అయ్యాయి. వచ్చే వారంలో తీవ్ర ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. గాలి కదలికలు సరిగ్గా లేకపోవడం, శీతాకాలం కారణంగా గాలి నాణ్యతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వ్యక్తులు, వృద్ధులతోపాటూ చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కళ్ళ మంటలు వంటి వాటికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Post

ఎప్పుడూ కామ్ గా ఉండే మంత్రి నిమ్మల ఈసారి సీరియస్!ఎప్పుడూ కామ్ గా ఉండే మంత్రి నిమ్మల ఈసారి సీరియస్!

మంత్రి నిమ్మల రామానాయుడుకు సౌమ్యుడు అన్న పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు, కాంట్రవర్సీలకు ఆయన దూరంగా ఉంటారు. వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వారిని ఇరకాటంటో పెడుతుంటారు. అధికారులపై కూడా ఆయన ఎప్పుడూ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అయితే, తొలిసారిగా

కవితకు కేసీఆర్ అవసరం లేదుకవితకు కేసీఆర్ అవసరం లేదు

బీఆర్‌ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రజల మధ్యకు వస్తేందుకు రెడీ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాజా జాగృతి జనం బాట

గత పాలనలో న్యాయమూర్తులనూ వేధించారు: జస్టిస్ ఎన్వీ రమణగత పాలనలో న్యాయమూర్తులనూ వేధించారు: జస్టిస్ ఎన్వీ రమణ

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి భ‌విష్య‌త్తులో ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఎదుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని సుప్రీంకోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌రిగిన అతిపెద్ద పోరాటం ఏదైనా ఉంటే.. అది అమ‌రావ‌తి