hyderabadupdates.com movies తండ్రీకొడుకుల భావోద్వేగంలో ‘బైకర్’ పందెం

తండ్రీకొడుకుల భావోద్వేగంలో ‘బైకర్’ పందెం

జనవరిలో సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ పెట్టుకుని, చివరిలో వచ్చినా నారి నారి నడుమ మురారితో హిట్టు కొట్టిన శర్వానంద్ మూడు నెలలు తిరగడం ఆలస్యం మరో కొత్త సినిమా బైకర్ తో వస్తున్నాడు. ఏప్రిల్ 3 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని యువి క్రియేషన్స్ నిర్మించగా అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేసి కంటెంట్ ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చారు.

విక్కీ (శర్వానంద్) కు బైక్ రేసింగ్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి దాని మీద విపరీతమైన ఆసక్తి పెంచుకుని రాటు దేలాలని విపరీతంగా కష్టపడుతూ ఉంటాడు. అయితే బైకర్ గా గొప్ప పేరున్న తండ్రి (రాజశేఖర్) మాత్రం కొడుకుని కంట్రోల్ చేయాలని చూస్తూ ఏ మాత్రం ప్రోత్సహించేలా ప్రవర్తించడు. ఎంత కఠినంగా ఉంటే బిడ్డ అంత రాటు దేలతాడని ఆయన నమ్మకం. మరి ఈ నాన్న కొడుకుల సంఘర్షణలో చివరికి ఎవరు గెలిచారనేది తెరమీద చూడాలి.

కమర్షియల్ హంగులకు దూరంగా ఒక సరికొత్త క్రీడా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు దర్శకుడు అభిలాష్ రెడ్డి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఆటకన్నా ఎక్కువగా ఎమోషన్స్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత కనిపిస్తున్న రాజశేఖర్ హుందాగా, శర్వా తండ్రిగా బైకర్ కు పెద్ద ప్లస్ అయ్యేలా ఉన్నారు. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో పెట్టిన సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బిగ్ స్క్రీన్ మీద మంచి థ్రిల్ ఇచ్చేలా ఉన్నాయి.

మోటో రేసింగ్ మీద వచ్చిన మొదటి సినిమాగా బైకర్ ప్రత్యేకత సంతరించుకుంది. గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు టెక్నికల్ టీమ్ పడిన కష్టం తెరమీద కనిపిస్తోంది. శర్వానంద్, రాజశేఖర్ తో పాటు హీరోయిన్ మాళవిక నాయర్, అతుల్ కులకర్ణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ లో వాళ్ళను రివీల్ చేశారు. ఏప్రిల్ 3 విడుదల కాబోతున్న బైకర్ ట్రైలర్ లో ప్రామిసింగ్ కంటెంట్ అయితే కనిపించింది. సినిమా మొత్తం ఇలా ఉంటే శర్వా ఖాతాలో మరో సూపర్ హిట్ పక్కా.

Related Post

క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!క‌లిసిన పాత మిత్రులు: బాబు-తుమ్మ‌ల భేటీ!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు క‌లుసుకున్నారు. సోమవారం అమ‌రావ‌తికి వ‌చ్చిన తుమ్మ‌ల‌.. చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. వాస్త‌వానికి.. మైక్రోసాఫ్ట్ స‌హ వ్యవస్థాప‌కులు బిల్ గేట్స్ అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు

Top 10 Must-Watch Malayalam Films of 2025 on OTT: Pranav Mohanlal’s Diés Iraé to Lokah Chapter 1: ChandraTop 10 Must-Watch Malayalam Films of 2025 on OTT: Pranav Mohanlal’s Diés Iraé to Lokah Chapter 1: Chandra

Cast: Kalyani Priyadarshan, Naslen, Sandy Master, Arun Kurian, Chandu Salim Kumar, Raghunath Paleri, Vijayaraghavan, Dulquer Salmaan (cameo), Tovino Thomas (cameo), Mammootty (voice-only cameo) Director: Dominic Arun Genre: Superhero Action Where