hyderabadupdates.com movies తమన్ మీద ఒత్తిడి పెరుగుతోంది

తమన్ మీద ఒత్తిడి పెరుగుతోంది

టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ పేరు ముందు వరసలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓజికి తనిచ్చిన అవుట్ ఫుట్ కి అభిమానులు ఫుల్ హ్యాపీ. పాటలు కొంచెం హడావిడిగా అనిపించినా బీజీఎమ్ రూపంలో పూర్తిగా సంతృప్తి పరిచాడు. అయితే ఇటీవలి పరిణామాలు గమనిస్తే తమన్ మీద ఒత్తిడి పెరుగుతోందని చెప్పాలి. అఖండ 2 తాండవం నుంచి వచ్చిన రెండు పాటలు భారీ రీచ్ తెచ్చుకోలేదు. టైటిల్ సాంగ్ ఓకే అనిపిస్తే జాజికాయ జాజికాయ మీద ఓవర్ పాజిటివ్ కామెంట్స్ రాలేదు. అభిమానులు ఓకే అనుకున్నారు కానీ న్యూట్రల్ మ్యూజిక్ లవర్స్ కి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది.

ఇదే కాదు రాజా సాబ్ సాంగ్ మీద కూడా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన సోషల్ మీడియాలో కనిపిస్తోంది. మిక్సింగ్ గురించి కంప్లయింట్ చేస్తున్నారు, ఆ మధ్య తెలుసు కదాలో తెరమీద జరుగుతున్న కంటెంట్ కన్నా ఎక్కువ హోరెత్తిపోయేలా నేపధ్య సంగీతం ఇవ్వడం గురించి రివ్యూలలో ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. ఇవి చాలవు అన్నట్టు పెద్దికి రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి వరల్డ్ వైడ్ రీచ్ తెచ్చుకోవడం పోలిక పరంగా తమన్ పాటలకు ఇబ్బందై కూర్చుంది. దాని స్థాయిలో కాకపోయినా కనీసం సగమైనా ఉంటే తప్ప జనాలకు వేరే సాంగ్స్ అంత సులభంగా నచ్చడం లేదు.

తమన్ ఇప్పుడు కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇదయం మురళి అనే తమిళ సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. మొన్న పుట్టినరోజు వేడుక ఆ సెట్స్ లోనే చేశారు. ఇంకోవైపు వీలు దొరికినప్పుడంతా క్రికెట్ మీద సమయం గడుపుతూ ఉంటాడు. ఇవన్నీ పర్సనలే కానీ ముందైతే స్టార్ హీరోల ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచే అతి పెద్ద బాధ్యత తమన్ మీద ఉంది. ఒకప్పటి దూకుడు, అల వైకుంఠపురములో రేంజ్ లో మేజిక్ రిపీట్ చేయాలి. అప్పుడే ఎలాంటి కామెంట్స్ రావు. ముందైతే రాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ విషయంలో తమన్ వందకు వంద శాతం బెస్ట్ ఇవ్వాలనేది ఫ్యాన్స్ డిమాండ్.

Related Post

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలురాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు బాగా కనెక్ట్ కాగా జాజికాయ జాజికాయ సాంగ్ అఖండ 1లో జై బాలయ్య రేంజ్ లో కంపోజ్ కాలేదు. ఇక

రాజ‌శేఖ‌ర్‌కు ఆ సిండ్రోమ్రాజ‌శేఖ‌ర్‌కు ఆ సిండ్రోమ్

ఒక‌ప్పుడు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖర్ ఒక‌రు. 90వ ద‌శ‌కంలో అంకుశం, అల్ల‌రి మ‌గాడు, ప్రియుడు లాంటి చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు అభిమానులు యాంగ్రీ యంగ్‌మ్యాన్ అని పిలుచుకునే ఈ సీనియ‌ర్ హీరో. ఐతే చాలామంది సీనియ‌ర్