hyderabadupdates.com movies తమిళుల మనసు గెలుచుకున్న బాబు

తమిళుల మనసు గెలుచుకున్న బాబు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అందులో భాగంగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలోకి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం దిగిపోయారు. సోమవారం తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్న చంద్రబాబు… ఎన్డీఏ పెద్దల వినతి మేరకు ఉదయాన్నే జన్మదిన వేడుకలను ముగించుకున్న చంద్రబాబు నేరుగా తమిళనాడులో వాలిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరులో అడుగుపెట్టిన చంద్రబాబు అక్కడి ఓటర్లు ఎన్డీఏ వైపునకు తిరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. వెరసి తమిళ ఓటర్ల మనసులను గెలుచుకుంటూ చంద్రబాబు సాగుతున్నారు.

కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం కోసం సోమవారం అక్కడికి చేరుకున్న చంద్రబాబు… తొలుత అక్కడి స్థానిక వ్యాపారులు, ప్రముఖులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా తమిళనాడు, ఏపీలకు ఉన్న సారూప్యతలను ప్రస్తావించిన చంద్రబాబు… ప్రాంతీయ వాదంలో తమిళులను మించిన వారు లేరని వ్యాఖ్యానించారు. అయితే డీఎంకే సర్కారు తమిళ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా తనదైన వింత శైలిలో ముందుకు సాగుతోందని ఆయన విమర్శించారు. తల్లి భాషను తమిళులు ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించరని కూడా ఆయన అన్నారు. ఈ మాటలతో అక్కడి తమిళ నాయకులు ఆశ్చర్య పోయారు. చంద్రబాబు అంత హుందాగా తమిళ భాష ప్రాముఖ్యతను కొనియాడడంతో వాళ్లందరి మనసులు చంద్రబాబు దోచుకున్నారనే చెప్పాలి.

తమిళనాడుతో పాటుగా ఏపీని కలిపి ద్రవిడ ప్రాంతంగా పరిగణిస్తున్న వైనాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ద్రవిడ సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశ్యంతోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ద్రవిడ వర్సిటీని ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక తమిళ, తెలుగు ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. తమిళ ప్రజల దాహార్తిని తీర్చేందుకే తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టినట్టుగా ఆయన పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు.

క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వం తమిళుల సొంతమని చెప్పిన చంద్రబాబు.. ఈ కారణంగానే తమిళులు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. అయితే తమిళులు మరింత ఉన్నతిని సాధించే దిశగా డీఎంకే సర్కారు పయనించడం లేదని ఆయన ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏం లాభమన్న విషయాన్ని తమిళ ఓటర్లు తెలుసుకోవాలన్న చంద్రబాబు… ఏపీలో 22 నెలల వ్యవధిలోనే డబుల్ ఇంజిన్ సర్కారుతో అద్భుతాలు సృష్టించామన్నారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుటడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయన్న చంద్రబాబు… తమిళనాడుకూ అలాంటి పెట్టుబడులు రావాలంటే… బీజేపీ మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే కూటమికే ఓటు వేయాలని కోరారు.

Related Post

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీరి క‌ష్టాలు తీర్చేందుకు పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు

కుక్కల సినిమాను పోటీపడి చూస్తున్నారుకుక్కల సినిమాను పోటీపడి చూస్తున్నారు

గత నవంబర్ లో విడుదలైన మలయాళ సినిమా ఎకో కేవలం అయిదు కోట్ల బడ్జెట్ తో రూపొంది యాభై కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. హైదరాబాద్ లో కొన్ని రోజులు నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్ అయిన ఘనత

Chiranjeevi’s “Meesala Pilla” Song from Mana Shankara Vara Prasad Garu Creates BuzzChiranjeevi’s “Meesala Pilla” Song from Mana Shankara Vara Prasad Garu Creates Buzz

The first single Meesala Pilla from Megastar Chiranjeevi’s upcoming family entertainer Mana Shankara Vara Prasad Garu is out now and already trending everywhere. The promo had created massive excitement, and