hyderabadupdates.com movies తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడ అదిరిపోయే సినిమాలు చేసింది. పింక్, నామ్ షబానా, ముల్క్, తప్పడ్, హసీన్ దిల్‌రుబా లాంటి సినిమాలతో తాప్సి ఎంత మంచి నటో అందరికీ తెలియజేశాయి.

అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయికి ఆమె ఎదిగింది. ముఖ్యంగా సామాజిక అంశాలతో ఆమె చేసిన పింక్, ముల్క్, తప్పడ్ సినిమాలు ప్రేక్షకులను కదిలించాయి. బాలీవుడ్లో ఒక కొత్త ఒరవడికి దారి తీశాయి. ఇప్పుడు ఈ కోవలోనే ఇంకో స్టన్నింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తాప్సి. ఆ చిత్రమే.. అస్సీ. 

ఒక రేప్ బాధితురాలి కోసం అలుపెరగని పోరాటం చేసే లాయర్ పాత్రలో తాప్సి నటించిన చిత్రమిది. ఉపాధ్యాయురాలైన ఒక మహిళ మీద ఐదుగురు కుర్రాళ్లు అత్యాచారం చేసి రైల్వే ట్రాక్ మీద దయనీయ స్థితిలో పడేస్తారు. ఆమెను కాపాడి ఆసుపత్రిలో చికిత్స చేయించాక.. తన మీద ఆ అఘాయిత్యానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చేయాలనుకుంటుందామె.

ఆమె కేసును తాప్సి టేకప్ చేస్తుంది. టైటిల్‌కు తగ్గట్లుగా ఈ రేప్ జరిగిన రోజే ఇండియాలో 80 అత్యాచార ఘటనలు జరిగాయని.. కానీ వాటిలో 76 కేసుల గురించి ఎవరూ రిపోర్ట్ కూడా చేయలేదన్న లాయర్ వాదనతో ఈ ట్రైలర్ ఆరంభమైంది. 

రేప్ బాధితురాలితో అవతలి పక్షం లాయర్ ఎంత దారుణంగా వ్యవహరిస్తాడు.. కోర్టులో ఇలాంటి కేసులను నిరూపించడం ఎంత కష్టమవుతుంది.. బాధితురాలి మీద, లాయర్ మీద ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయి అన్నది చాలా ప్రభావవంతంగా చూపించినట్లున్నాడు దర్శకుడు అనుభవ్ సిన్హా. డైలాగులు చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉన్నాయి.

ఇందులో రేప్ బాధితురాలిగా మలయాళ నటి కను సుకృతి నటించింది. ఆమెతో పాటు తాప్సి పెర్ఫామెన్స్ వేరే లెవెల్లో ఉంటాయనిపిస్తోంది. అనుభవ్ రూపొందించిన ఆర్టికల్ 15, ముల్క్, తప్పడ్ చిత్రాల్లాగే ఇది కూడా ప్రత్యేకమైన సినిమాలాగే కనిపిస్తోంది. ఈ నెల 20న ‘అస్సీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Post

మ‌మ్ముట్టి… ఇక్క‌డ యాత్ర‌… అక్క‌డ పాద‌యాత్ర‌మ‌మ్ముట్టి… ఇక్క‌డ యాత్ర‌… అక్క‌డ పాద‌యాత్ర‌

మ‌ల‌యాళ లెజెండ‌రీ న‌టుడు మ‌మ్ముట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగానే ప‌రిచ‌యం. 90వ ద‌శ‌కంలోనే ఆయ‌న స్వాతికిర‌ణం లాంటి క‌ల్ట్ మూవీలో న‌టించి తెలుగు ఆడియ‌న్సుని మైమ‌రిపించారు. త‌మిళ అనువాదం ద‌ళ‌ప‌తితోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌మైన ముద్ర వేశారు. ఇక కొత్త

Review : Gunasekhar’s Euphoria – A Social Drama That Works in PartsReview : Gunasekhar’s Euphoria – A Social Drama That Works in Parts

Movie Name : Euphoria Release Date : Feb 06, 2026 123telugu.com Rating : 2.75/5 Starring : Bhumika Chawla, Sara Arjun, Nassar, Rohith, Vignesh Gavireddy, Likhita Yalamanchali, Addala Prudhviraj, Kalpa Latha,

Ram’s Andhra King Taluka: Fourth single ‘First Day First Show’ gets a launch dateRam’s Andhra King Taluka: Fourth single ‘First Day First Show’ gets a launch date

Hero Ram’s much-awaited film, Andhra King Taluka, is making all the right noises ahead of its release on November 28, 2025. Sandalwood star Upendra and young actress Bhagyashri Borse play