hyderabadupdates.com movies తాలూకా లెక్క ఎక్కడ తగ్గిందంటే

తాలూకా లెక్క ఎక్కడ తగ్గిందంటే

ఓవర్సీస్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. పబ్లిక్ టాక్ బాగానే ఉంది. ఇండియన్ సమీక్షలు పాస్ సర్టిఫికెట్ ఇచ్చాయి. ఇన్ని జరిగినా ఆంధ్రకింగ్ తాలూకా అద్భుతం చేయలేకపోయింది. వసూళ్లు డీసెంట్ గా ఉన్నప్పటికీ సినిమాకొచ్చిన రెస్పాన్స్ కు, లెక్కలకు పొంతన కుదరడం లేదు. అభిమానులు కనీసం బ్లాక్ బస్టర్ ఎక్స్ పెక్ట్ చేశారు. ఇప్పుడు సూపర్ హిట్ స్టాంప్ పడితే చాలని కోరుకుంటున్నారు. అంగట్లో అన్నీ ఉన్నాయని అదేదో పాత సామెత చెప్పినట్టు తాలూకా లెక్క ఎక్కడ తగ్గిందో అర్థం కావడం లేదంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. దీనికి సమాధానం దొరకాలంటే కొంచెం లోతుగా విశ్లేషించుకోవాలి.

దర్శకుడు మహేష్ బాబు ఉద్దేశం మంచిదే. ఒక ఫ్యాన్ ఎమోషన్ తెరమీద నిజాయతిగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫ్యానిజం ఎలివేట్ అయిపోయి సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాన్ని తగ్గించేసింది. ఎంతసేపూ అభిమానాన్ని పాజిటివ్ గా చూపించి లాజిక్స్ ని కన్వీనియంట్ గా వాడుకున్నారు తప్పించి, ఇంత అతిగా హీరోలను ప్రేమించడం వల్ల జరిగే అనర్థాలను కూడా టచ్ చేసి ఉంటే భావోద్వేగాలు మరింత బాగా పండి ఉండేవి. ఇందులో రామ్ పోషించిన సాగర్ పాత్రకు ఇబ్బందులు తప్ప భయపడే కష్టాలు ఉండవు. థియేటర్ కట్టడం నుంచి మూడు కోట్లు పోగయ్యే దాకా అన్నీ తనకు అనుకూలంగా జరిగిపోతాయి.

ఇంకో సమస్య ఉపేంద్ర అని చెప్పక తప్పదు. తనో గొప్ప నటుడే కానీ మనకు కనెక్టివిటీ తక్కువ. ఎప్పుడో ఒకేసారి అలా కనిపించడం తప్ప రెగ్యులర్ టచ్ లో లేరు. దాని వల్ల వంద సినిమాల హీరో అనే పాయింట్ అంతగా సింక్ అవ్వలేదు. ఎంత 2002 లో అయినా మూడు కోట్లకే రోడ్డు మీదకు వచ్చేంత సీన్ ఉండదని కామన్ ఆడియన్స్ ఫీలయ్యారు. వీటికి తోడు గురువారం రిలీజ్ కూడా కొంచెం రిస్క్ లో పడేసింది. ఇంద్ర, మహానటి లాంటివి బుధవారమే బ్లాక్ బస్టర్లు సాధించినప్పుడు గురువారం పెద్ద మ్యాటర్ కాదనే విషయాన్ని అంగీకరించాలి. రేపు రామ్ తిరిగి వచ్చాక ప్రమోషన్లకు మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ వేస్తారేమో చూడాలి.

Related Post

డీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదుడీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదు

వారిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు. రాజకీయంగా పార్టీలూ వేరే. అయినా వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు తెలంగాణలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

Buzz: Versatile actor playing a key role in Rajinikanth’s Jailer 2Buzz: Versatile actor playing a key role in Rajinikanth’s Jailer 2

Superstar Rajinikanth is currently busy with the shoot of his much-anticipated sequel, Jailer 2. The first part was a humongous blockbuster at the ticket windows, earning over Rs. 600 crores

పీకే.. స‌ఫ‌ల స్ట్రాట‌జిస్టు.. విఫ‌ల పాలిటిస్టు!పీకే.. స‌ఫ‌ల స్ట్రాట‌జిస్టు.. విఫ‌ల పాలిటిస్టు!

ప్రశాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఆయన ప‌లు సంద‌ర్భాల్లో స‌ఫ‌ల‌మ‌య్యారు. కానీ.. రాజ‌కీయ నేత‌గా మాత్రం ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. ఎందుకంటే.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త నుంచి ఆయ‌న రాజ‌కీయ నేత‌గా ఆవిర్భ‌వించారు. కానీ.. రాజ‌కీయంగా ఆయ‌న శ‌కునం చెప్పే