hyderabadupdates.com Gallery తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్

తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్

తిరుప‌తి  న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్ post thumbnail image

తిరుప‌తి : తిరుప‌తి న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం స‌మీక్ష చేప‌ట్టారు. నగర కమిషనర్ మౌర్య‌ , అదనపు కమిషనర్ , అధికారులు పాల్గొన్న సమావేసాశాన్ని ఉద్దేశించి మేయర్ మాట్లాడారు.2026 – 2027 సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పన చేసే సందర్భంగా మనం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రీ బ‌డ్జెట్ స‌మావేశానికి ప్రాధాన్య‌త ఉంద‌న్నారు డాక్ట‌ర్ శిరీష‌. గత బడ్జట్ అంచనాలు, అమలు తీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు.
2025 … 26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆమోదించిన బడ్జెట్ అంచనాలు తగ్గట్లు ఆదాయం వచ్చిందా లేదా అన్న‌ది కూడా ముఖ్య‌మ‌న్నారు. ముఖ్యంగా పన్నులు ప్రధాన ఆదాయం అని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలపై భారం లేకుండా చూడాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో తిరుప‌తి న‌గ‌రంంలో పెద్ద ఎత్తున వ్య‌క్తిగ‌త‌, సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌లు ఉంటున్నాయ‌ని, వాటి పై ప‌న్నులు విధించ‌డం ద్వారా ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. వివిధ రకాల పన్నులు వసూలు కాకపోతే అందుకు తగిన కారణాలపై కూడా విశ్లేషించాల‌ని అన్నారు. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో కౌన్సిల్ ఆమోదించిన ప్రాధాన్యత క్రమంలో నిధుల ఖర్చు చేశామా లేదా అన్నది సవివవరంగా కౌన్సిల్ ముందు ఉంచాలని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్.
The post తిరుప‌తి న‌గ‌ర వాసుల‌కు మేలు చేకూర్చేలా బ‌డ్జెట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India: 270 మంది మయన్మార్‌ స్కామ్‌ సెంటర్‌ బాధితులకు విముక్తిIndia: 270 మంది మయన్మార్‌ స్కామ్‌ సెంటర్‌ బాధితులకు విముక్తి

    మయన్మార్‌లో స్కామ్‌ సెంటర్‌ నుంచి పరారై సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్‌ పట్టణం మే సొట్‌లో తలదాచుకున్న 270 మంది భారతీయులు గురువారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు మిలటరీ రవాణా విమానాల్లో వారిని తీసుకువచ్చింది. మయన్మార్‌లోని

Lord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహంLord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం

      ఉత్తర్‌ప్రదేశ్‌ లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 18 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని లఖ్‌నవూలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఏర్పాటు చేశారు. దీనిని యూపీ ఉప ముఖ్యమంత్రి

AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తAP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government : ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.