తిరుమల : కోట్లాది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామి వారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసన ఆధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామి వారిని వేంచేపు చేస్తారు. ఇదిలా ఉండగా సూర్య ప్రభ వాహనం మీద ఊరేగారు స్వామి వారు. ఉదయం 5.30 గంటల నుండి 8 గంటలకు నిర్వహించారు ఘనంగా. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్య నారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతే జఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్య నారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
The post తిరుమలలో అంగరంగ వైభవంగా రథ సప్తమి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తిరుమలలో అంగరంగ వైభవంగా రథ సప్తమి
Categories: