ముంబై : హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చినా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ వరుసగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లలో తీవ్ర నిరాశ పరిచాడు. తను కేవలం 10, 6, 0 మాత్రమే చేశాడు. మూడో వన్డేలో నైనా ఆడతాడని అనుకుంటే ఏకంగా డకౌట్ అయ్యాడు. ఇక తనను ఎంతమాత్రం కొనసాగించక పోవచ్చు. ఇక సీరీస్ విషయానికి వస్తే భారత జట్టు ఇంకా 2 టి20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తిలక్ వర్మకు గాయం కావడంతో తను ప్రస్తుతం బెంగళూరులోని క్రికెట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్నాడు. ఏ క్రికెటర్ అయినా సరే జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ముందు ఫిట్ నెస్ నిరూపించు కోవాల్సి ఉంటుంది. తాజాగా తిలక్ వర్మ అన్ ఫిట్ అయ్యాడు. దీంతో తను చివరి రెండు మ్యాచ్ లకు దూరం పెట్టాల్సి వచ్చిందని తెలిపింది బీసీసీఐ.
మరో వైపు అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ , రింకూ సింగ్ లు సూపర్ పర్ ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతున్నది ఒకే ఒక్కడు శాంసన్. ఇక తిలక్ వర్మ స్థానంలో మరొకరిని ఆడించేందుకు రెడీ అయ్యాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. తను పటిష్టమైన జట్టును తయారు చేస్తున్నాడు వచ్చే ఫిబ్రవరిలో జరిగే టి20 ఐసీసీ వరల్డ్ కప్ లో. ఇక తిలక్ వర్మ మూడో స్థానంలో నమ్మకమైన ప్లేయర్ గా ఇప్పటి వరకు గుర్తింపు పొందాడు ఈ హైదరాబాదీ. కానీ అనుకోకుండా తన ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్ ను ఎంచుకున్నట్లు ధ్రువీకరించింది బీసీసీఐ. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు తిలక్ వర్మ.
The post తిలక్ వర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ లకు నో ఛాన్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
తిలక్ వర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ లకు నో ఛాన్స్
Categories: