hyderabadupdates.com Gallery తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల

తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల

తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల post thumbnail image

హైద‌రాబాద్ : ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన ఓరుగ‌ల్లు చిర‌కాల వాంఛ తీర‌నుంది. త్వ‌ర‌లోనే ఎయిర్ పోర్టు రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి కోసం భూమిని అప్పగించే కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , కొండా సురే, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ , పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,శాసనసభ్యులు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్ ఉందని, అందుకే ఈ ప్రజా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా మూడు ఎయిర్‌పోర్ట్ లను ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు ఈ సంద‌ర్బంగా డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా తెలుగు రాష్ట్రానికి చెందిన సోదరులు రామ్మోహన్ నాయుడు కావడం ఎంతో గర్వకారణంగా ఉంద‌న్నారు.
ముఖ్యంగా వరంగల్ ప్రజల చిరకాల కోరికైన ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇద్దరు శాసన సభ్యులు అక్కడ రైతులందరిని ఒప్పించి పూర్తి సహకారంతో ఎయిర్ పోర్ట్ భూములను ఇప్పించడం జరిగింద‌న్నారు. ఇప్పటికైనా ఆ కోరికను నెరవేర్చుతున్నందుకు కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామ‌న్నారు డిప్యూటీ సీఎం. వీలైనంత తొందరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని కోరారు రామ్మోమ‌న్ నాయుడును.
The post తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులుBengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

  బెంగళూరు ఏటీఎం వ్యాన్‌ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు… కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా

Election Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీElection Commission: టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు – ఈసీ

Election Commission : తమిళ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విజయ్‌ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు

Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్Minister Konda Surekha : బీఆర్ఎస్‌ సోషల్ మీడియాపై మంత్రి కొండా సురేఖ ఫైర్

Konda Surekha : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి