hyderabadupdates.com movies తుపాకీ కాల్పులు వల్ల నటుడి బిజినెస్ ఇంకా పెరిగిందట

తుపాకీ కాల్పులు వల్ల నటుడి బిజినెస్ ఇంకా పెరిగిందట

కెనడాలో తన కేఫ్‌పై జరిగిన వరుస కాల్పుల గురించి స్టార్ కమెడియన్ కపిల్ శర్మ తొలిసారి నోరు విప్పాడు. అక్కడ మూడుసార్లు అటాక్స్ జరిగినా, తనకేం భయం లేదన్నట్లుగా మాట్లాడాడు. తన కొత్త సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయంపై స్పందిస్తూ, కెనడా పోలీసుల తీరుపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. బహుశా అక్కడి రూల్స్ వల్ల పోలీసులకు ఇలాంటి ఘటనలను కంట్రోల్ చేసే పవర్ లేదేమో అనిపిస్తోందని అన్నాడు.

ఇదే సమయంలో ముంబై పోలీసులపై మాత్రం కపిల్ ప్రశంసల వర్షం కురిపించాడు. “నాకు మన దేశంలో, ముఖ్యంగా ముంబైలో ఉన్నంత సేఫ్ ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. ముంబై పోలీసుల పనితీరు ఎంత షార్ప్‌గా ఉంటుందో మనందరికీ తెలుసు. వేరే ఏ సిటీ కూడా ముంబైకి సాటి రాదు” అని తేల్చి చెప్పాడు. విదేశాల్లో రక్షణ లేకపోయినా, మన దగ్గర మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉందని గర్వంగా చెప్పుకున్నాడు.

ఇక్కడే కపిల్ శర్మ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. సాధారణంగా తుపాకీ కాల్పులు జరిగితే జనాలు భయపడి షాపుకు రారు. కానీ తన కేఫ్ విషయంలో సీన్ రివర్స్ అయ్యిందట. “ప్రతిసారి కాల్పులు జరిగిన తర్వాత, మా కేఫ్‌కి ఇంకా ఎక్కువమంది వచ్చారు. బిజినెస్ ఇంకా పెరిగింది. దేవుడు మనతో ఉంటే అంతా మంచే జరుగుతుంది” అని నవ్వుతూ చెప్పాడు. జూలై, ఆగస్టు, అక్టోబర్‌లలో మూడుసార్లు అటాక్స్ జరిగినా, సర్రేలోని తన ‘కప్స్ కేఫ్’ క్రేజ్ మాత్రం తగ్గలేదట.

అయితే, తన కేఫ్‌పై జరిగిన దాడులు కెనడా ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కపిల్ తెలిపాడు. ఈ విషయం అక్కడి ఫెడరల్ గవర్నమెంట్ దాకా వెళ్లిందని, పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగిందని చెప్పాడు. తన ఇన్సిడెంట్ తర్వాతే అక్కడ లా అండ్ ఆర్డర్ గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టారని, ఇప్పుడు కొత్త చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించాడు. చాలామంది తనకు ఫోన్ చేసి, ఈ విషయం న్యూస్ అవ్వడం వల్లే అక్కడ మార్పు వస్తోందని చెప్పారట.

Related Post

వెంకటేష్ ఫహద్ కోసం ముగ్గురు భామలు ?వెంకటేష్ ఫహద్ కోసం ముగ్గురు భామలు ?

దగ్గుబాటి అభిమానులు ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ దర్శకుడు అనిల్ రావిపూడి పదో సినిమా. ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్న ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు ఇప్పుడప్పుడే ప్రకటన ఇచ్చే ఆలోచనలో లేరని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం

Venky Kudumula Unveils Finding Arjuna Vol.1, Spotlight on AnieshVenky Kudumula Unveils Finding Arjuna Vol.1, Spotlight on Aniesh

Star director Venky Kudumula has stepped into film production with Itlu Arjuna – Finding Arjuna Vol.1, the first project under his banner What Next Entertainments. The film introduces newcomer Aniesh

కూటమి మరింత స్ట్రాంగ్…!కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది.