hyderabadupdates.com movies తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక ఇంత ఎదురు చూడాల్సి రావడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో బొబ్బిలిపులి, ఇద్దరు, బొంబాయి లాంటివి వివాదాలు ఎదురుకున్నాయి కానీ ఇప్పటి జనరేషన్ అలాంటివి చూసిన దాఖలాలు తక్కువ. ఆ లోటుని జన నాయకుడు తీర్చేసింది. ఇక అసలు విషయానికి వద్దాం.

చెన్నై వర్గాల కథనం ప్రకారం జన నాయకుడు విడుదలకు రెండు ఆప్షన్లు పెట్టుకుందట. మొదటిది ఎన్నికలు పూర్తవ్వగానే వదిలేయడం. అంటే ఎక్కువ గ్యాప్ లేకుండా థియేటర్లలో దింపేస్తారు. రెండోది ఏప్రిల్ 30 ఎంచుకోవడం. ఫలితాలు రాక ముందే రిలీజ్ చేయమని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారట. ఒకవేళ టివికె పార్టీ ఓడిపోయే పక్షంలో ఆడియన్స్ కి జన నాయకుడు మీద ఆసక్తి తగ్గిపోతుందని, ఓపెనింగ్స్ పరంగా రిస్క్ అయ్యే డేంజర్ ఉందని అంటున్నారు.

గెలిస్తే అదే జన నాయకుడుకి పెద్ద వరం అవుతుంది. కలెక్షన్లు పోటెత్తుతాయి. అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో జనం సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఇవన్నీ అలోచించి ఇంకో రెండు మూడు రోజుల్లో అనౌన్స్ మెంట్ ఇచ్చే దిశగా కెవిఎన్ సంస్థ రెడీగా ఉన్నట్టు వినికిడి. సెన్సార్ సర్టిఫికెట్ అందిన మరుక్షణం సోషల్ మీడియాని హోరెత్తిస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధంగా ఉంచుకుని సెన్సార్ కోసం ఎదురు చూస్తున్నారట.

ఏప్రిల్ 24 తర్వాత సమస్య లేదు కానీ ఏప్రిల్ 30 అంటే మాత్రం ఆ టైంలో ప్లాన్ చేసుకున్న సినిమాలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. తెలుగు వెర్షన్ వరకు టెన్షన్ లేదు. భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి ఇక్కడి ప్రేక్షకుల్లో దాని మీద విపరీతమైన ఆసక్తి ఉండదు. కానీ మా ఇంటి బంగారం, స్వయంభు లాంటివి మల్టీ లాంగ్వేజెస్ ప్లాన్ చేసుకున్నాయి. వాటికి సమస్య అవుతుంది. సో వీలైనంత త్వరగా జన నాయకుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తే మిగిలిన వాళ్లకు సానుకూలం అవుతుంది.

Related Post

మ్యాక్స్ ఆడింది… మార్క్ ఓడిందిమ్యాక్స్ ఆడింది… మార్క్ ఓడింది

ఈగ విలన్ గా మనకు దగ్గరైన కిచ్చ సుదీప్ బాహుబలి, సైరా నరసింహారెడ్డిలో క్యామియోలు చేయడం ద్వారా ఇంకాస్త పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే క్రిస్మస్ పండగ రోజు తన మార్క్ సినిమా రిలీజయ్యింది. గత ఏడాది ఇదే టైంలో చేసిన మ్యాక్స్

అఫీషియల్ – అఖండ 2 ఆగమనంఅఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా మారిన అఖండ 2 వాయిదా కథ క్లైమాక్స్ కు చేరుకుంది. అభిమానుల ఒత్తిడో లేక ఇంకేదైనా కారణమో తర్వాత చూసుకోవచ్చు

₹499 Family Ticket Offer for ‘Sampradayini Suppini Suddapoosani’ Creates Buzz₹499 Family Ticket Offer for ‘Sampradayini Suppini Suddapoosani’ Creates Buzz

The upcoming crime-comedy entertainer Sampradayini Suppini Suddapoosani is generating strong buzz ahead of its theatrical release on March 6, 2026. Produced and headlined by Sivaji, the film brings back the