hyderabadupdates.com movies తెలివైన ఎత్తుగడ వేసిన ప్యారడైజ్

తెలివైన ఎత్తుగడ వేసిన ప్యారడైజ్

ఎట్టకేలకు న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ముందు ప్రకటించిన మార్చి 26 సాధ్యం కాదని గత రెండు నెలలుగా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ టీమ్ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు.

రామ్ చరణ్ పెద్ది కూడా వాయిదా పడి ఏప్రిల్ 30కి వెళ్లిపోవడంతో నాని ఏ స్లాట్ తీసుకుంటాడా అనే ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. దానికి చెక్ పెడుతూ ఆగస్ట్ 21 రెండు జడలు వేసుకుని రక్తపాతం సృష్టించేందుకు నాని రెడీ అవుతున్నాడు. అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగానే షూటింగ్ వేగవంతం చేయబోతున్నారు.

అయితే ఈ తేదీ వెనుక తెలివైన ఎత్తుగడ కనిపిస్తోంది. ఆగస్ట్ లో ప్యాన్ ఇండియా కాంపిటీషన్ మరీ ఎక్కువగా లేదు. ఆగస్ట్ రెండో వారం ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేసుకున్న వాటిలో బాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ బాటిల్ అఫ్ గాల్వాన్ తో పాటు సన్నీ డియోల్ లాహోర్ 1947 రానున్నాయి. హిందీ మార్కెట్లలో వీటిని ఫేస్ చేయడం కష్టం.

పైగా రజనీకాంత్ జైలర్ 2 ఇంచుమించు అదే సీజన్ లో వచ్చేలా ఉంది. సో ఆగస్ట్ మూడో వారాన్ని ప్యారడైజ్ ఎంచుకోవడం అన్నివిధాలా సేఫ్ గేమ్. ఇతర నిర్మాతలు తమ రిలీజ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు సరిపడా సమయం దొరికింది కాబట్టి మరింత బెస్ట్ అవుట్ ఫుట్ కోసం కష్టపడతారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. అనిరుద్ రవిచందర్ ఇంకా పూర్తి పాటలు ఇవ్వలేదు. రీ రికార్డింగ్ కి తగినంత టైం ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం.

జూన్ లేదా జూలై అనేసుకుని తర్వాత అతన్నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకోలేక ఇబ్బంది పడేదాని కన్నా ఇలా కొంచెం దూరంలో పెట్టుకోవడం మంచి ఆలోచన. కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ప్యారడైజ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ మెయిన్ విలన్లుగా నటించగా సంపూర్ణేష్ బాబు ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు.

Related Post

MM Keeravani’s Soulful Song Adds Emotional Depth to Upcoming Film PurushahaMM Keeravani’s Soulful Song Adds Emotional Depth to Upcoming Film Purushaha

Oscar-winning composer MM Keeravani once again proves his magic with the soulful song “Jaali Padedhevvadu” from the upcoming Telugu film Purushaha. The song has quickly caught attention for its emotional

దురంధరుడి వేట ఇప్పట్లో ఆగేలా లేదుదురంధరుడి వేట ఇప్పట్లో ఆగేలా లేదు

పెద్ద బడ్జెట్లలో తీసిన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చుకుంటాయి. ఆ హైప్‌కు తగ్గట్లు మంచి ఓపెనింగ్సూ వస్తాయి. కానీ చాలా సినిమాల విషయంలో జరిగేది ఏంటంటే.. వీకెండ్ అవ్వగానే చల్లబడిపోతుంటాయి. టాక్ బాగున్నా సరే.. వసూళ్లు క్రమ

Trailer of triangular love story Telusu Kada to be out on this date
Trailer of triangular love story Telusu Kada to be out on this date

Celebrity stylist Neerraja Kona stepped into the director’s chair, and Telusu Kada, starring Siddhu Jonnalagadda, Raashii Khanna, and Srinidhi Shetty in the lead roles, is her directorial debut. The film