hyderabadupdates.com movies తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ ‘పళ్ళి చట్టంబి’ తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్ ఫలితం అందుకుంది. అసలిది రిలీజైన విషయమే సగటు ప్రేక్షకులకు తెలియదంటే ఆశ్చర్యం లేదు. గతంలో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ పేరు మార్చకుండా ఒరిజినల్ టైటిల్ తో యథాతథంగా తీసుకొచ్చారు. తీరా చూస్తే కంటెంట్ బాగానే ఉన్నా కూడా ఆడియన్స్ కి చేరలేదు. కారణం సింపుల్. జనాలకు సదరు అరవ పేరు రిజిస్టర్ కాకపోవడమే.

రజనీకాంత్ ‘వెట్టయన్’కు ఈ తిప్పలు తప్పలేదు. ఇప్పటికీ కొందరు టాలీవుడ్ ఆడియన్స్ ఈ పేరుని వెంటనే గుర్తుపట్టలేరు. కావాలంటే ట్రై చేసి చూడండి. విక్రమ్ ‘తంగలాన్’ అంటే ఏంటో అర్థం కాక థియేటర్ కు వెళ్లడం మానుకున్న వాళ్ళు ఉన్నారు. అజిత్ ‘వలిమై’ని అభిమానులు తప్ప ఏపీ తెలంగాణలో చూసిన పబ్లిక్ తక్కువే. కారణం చెప్పనక్కర్లేదు. సూర్య కంగువ, ధనుష్ రాయన్, లారెన్స్ జిగర్ తండ డబుల్ ఎక్స్, మోహన్ లాల్ ఎంపురాన్ ఇవన్నీ ఒకే బాపతే. కంటెంట్స్ కొన్ని బాగుంటే కొన్ని బాలేవు.

అయినా సరే ప్రేక్షకులను చేరడంలో ఫెయిలయ్యాయి. ప్యాన్ ఇండియా పేరుతో అన్ని భాషలు ఒకటే అన్న సిద్ధాంతంతో ఇలా తమిళ మలయాళ టైటిల్స్ ని రుద్దడం వల్ల ఫైనల్ గా నష్టపోతున్నది నిర్మాతలే. ఒకప్పుడు కాదలన్ అంటే ప్రేమికుడు అని పెట్టేవాళ్ళు. ఆన్బే శివమ్ అంటే సత్యం శివమ్, మిన్సార్ కనవు అంటే మెరుపు కలలు, ఇరువర్ అంటే ఇద్దరు అని స్వచ్ఛమైన తెలుగు పేర్లను అనువాదాలకు చూసేవాళ్ళం. ఇప్పుడు అంత ఓపిక ఉండటం లేదు.

లేదూ మేము మారము ఇలాగే కొనసాగిస్తామంటే ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. ఎందుకంటే తాజాగా విడుదల కాబోతున్న వాలా 2 కూడా మళయాలం టైటిలే. అసలు 1 లేకుండా ఇప్పుడీ 2 ఎందుకు వస్తోందంటే ఒరిజినల్ వెర్షన్ బ్లాక్ బస్టర్ కావడం వల్లే. ఇక్కడా ఆడుతుందన్న నమ్మకం నిర్మాతలో ఉండొచ్చు కానీ బుకింగ్స్ అయితే అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అయినా ఎవరో ఒకరు పూనుకుని ఇలా అర్థం కాని టైటిల్స్ ప్రహసనానికి బ్రేక్ వేస్తే బెటర్.

Related Post

`ఆ ఎమ్మెల్యేల` బాధ్య‌త మీదే.. తేల్చేసిన చంద్ర‌బాబు`ఆ ఎమ్మెల్యేల` బాధ్య‌త మీదే.. తేల్చేసిన చంద్ర‌బాబు

టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు త‌ప్పు చేస్తే.. వారిని స‌రిదిద్దాల్సిన బాధ్య‌త మంత్రుల‌దేన‌ని పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. జిల్లాల‌కు ఇంచార్జ్‌లుగా ఉన్న మంత్రులు.. ఆ జిల్లాలోని 7-8 మంది ఎమ్మెల్యేల‌ను కూడా ప‌ర్య‌వేక్షించ‌లేరా? అని ప్ర‌శ్నించారు. తాజాగా

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్. ఇండియాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా రావాల్సి ఉందని, అందుకే దాన్ని ఇప్పటిదాకా రివీల్ చేయలేదని అంటున్నారు. DCP ఫైల్