hyderabadupdates.com movies తెలుగు సినిమాలపై తాప్సి మళ్లీ…

తెలుగు సినిమాలపై తాప్సి మళ్లీ…

ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు చేయడం చాలాసార్లు చూశాం. వాళ్లు నిజంగానే ఇక్కడ ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ ఏదైనా నచ్చనపుడు నో చెప్పే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా.. కెరీర్ అవసరాల దృష్ట్యా అప్పటికి అన్నింటికీ ఓకే చెప్పి తర్వాత విమర్శలు చేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

తెలుగులో చాలా వరకు గ్లామర్ పాత్రలే చేసి, బాలీవుడ్‌లోకి వెళ్లాక నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి పేరు సంపాదించిన ఇలియానా, తాప్సి లాంటి వాళ్లు.. తమను సౌత్ ఇండస్ట్రీ గ్లామర్ కోణంలోనే చూడడం మీద పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే గ్లామర్ రోల్స్ చేయడం ఇష్టం లేనపుడు వాటికి నో చెప్పి ఉండొచ్చనే ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి సమాధానం ఉండదు.

ఇప్పుడీ చర్చంతా ఎందుకంటే.. తాప్సి తాజాగా మరోమారు తెలుగు సినిమాలు, సౌత్ ఇండస్ట్రీ మీద నెగెటివ్ కామెంట్స్ చేసింది. తెలుగు చిత్రాల్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి మాట్లాడింది. ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా తనను ప్యాడిల్ బ్రా ధరించమని ఒత్తిడి తెచ్చినట్లు వెల్లడించింది.

దర్శకుడు దీని గురించి అసిస్టెంట్‌కు చెప్పడం, అతను కాస్ట్యూమ్స్ విభాగానికి చెప్పడం, వాళ్లు తనకు చెప్పడం.. ఇలా తనకు విషయం చేరిందని.. ఐతే తాను ప్యాడిల్ బ్రా ధరించాక అందరికీ తేడా స్పష్టంగా తెలిసిపోయిందని.. సెట్లో ఈ వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారిందని తాప్సి వ్యాఖ్యానించింది.

ఇక సౌత్ సినిమాల్లో నడుం, బొడ్డు ఫాంటసీ గురించి కూడా తాప్సి కామెంట్లు చేసింది. సౌత్ ఫిలిం మేకర్స్‌కు, ప్రేక్షకులకు దాని మీద అంత మోజు ఎందుకో తనకు తెలియదని వ్యాఖ్యానించింది. కెమెరా ఫోకస్ ఎక్కువగా అక్కడే ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో బాలీవుడ్‌కు హీరోయిన్ల క్లీవేజ్ మీద దృష్టి ఎక్కువ అని ఆమె కామెంట్ చేసింది. తాప్సి కీలక పాత్ర పోషించిన ‘అస్సీ’ సినిమా ఈ శుక్రవారం రిలీజై పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది.

Related Post

భార్యతో వలపు వల… 100 వీడియోలు తీసిన భర్తభార్యతో వలపు వల… 100 వీడియోలు తీసిన భర్త

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న క్రైం కథనాలు చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అన్న ప్రశ్న వేసుకునే వేళ.. మారిన కాలంలో విలువలు పాతాళానికి చేరిన వేళ.. ఇలానే కాదు ఏమైనా చేసే కొందరు దుర్మార్గులు

Stranger Things Isn’t Over: Upside Down Returns in 2026 Animated Series Tales From ’85Stranger Things Isn’t Over: Upside Down Returns in 2026 Animated Series Tales From ’85

The Duffer Brothers explained in a Netflix featurette that an animated series was one of their earliest ideas for expanding the Stranger Things universe. Matt Duffer said, “When we started