hyderabadupdates.com movies తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ అమాంతం ఆకాశంలో ధరలు పలుకుతాయి. కానీ గత రెండేళ్లుగా అనిరుధ్ తన మేజిక్ మిస్ అవుతున్న ఫీలింగ్ మ్యూజిక్ లవర్స్ లో కలుగుతోంది. ఆయా చిత్రాల కమర్షియల్ ఫలితాలతో తనకు సంబంధం లేకపోయినా కనీసం ఆల్బమ్ వరకు మంచి పాటలు ఇచ్చి ఉంటే సంగీత ప్రియులు ఎంజాయ్ చేసేవాళ్లనేది వాస్తవం.

తాజాగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ డిజాస్టర్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే అనిరుధ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి తప్ప దీనికి సాంగ్స్ ఇచ్చింది తనేననే విషయం సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. దీనికన్నా ముందు వచ్చిన శివ కార్తికేయన్ ‘మదరాసి’ పరిస్థితి కూడా ఇంతే. ‘కూలీ’లో మోనికా మోనికా పాట తప్ప మిగిలినదంతా నీరసం తెప్పించిన స్కోరే. కింగ్డమ్, విదాముయార్చి, వెట్టయన్, ఇండియన్ 2 అన్నింటిది ఇదే పరిస్థితి. ‘దేవర’ ఒక్కటే తన రేంజ్ ఆల్బమ్ అని చెప్పాలి.

వీలైనంత త్వరగా అనిరుధ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. చేతిలో ఇంకా బోలెడు సినిమాలున్నాయి. ‘జన నాయకుడు’ పాటలు సోసోగానే అనిపించాయి. ‘జైలర్ 2’కి అదరగొట్టే రేంజ్ లో వర్క్ చేయాలి. నాని ‘ప్యారడైజ్’లో ఆయా షేర్ తరహాలో అన్ని పాటలు ఉంటే కనక మరోసారి సోషల్ మీడియాని ఊపేయొచ్చు. షారుఖ్ ఖాన్ ‘కింగ్’తో పాటు కమల్ – రజని మల్టీస్టారర్ కూడా అనిరుధ్ ఖాతాలోనే ఉన్నాయి. అల్లు అర్జున్ 23 తనకే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఒకపక్క సాయి అభ్యంక్కర్ దూసుకుపోతున్నాడు. అనిరుధ్ ప్రత్యాన్మయంగా ఆల్రెడీ తనను నిర్మాతలు భావించడం మొదలైపోయింది. సో అనిరుధ్ సాలిడ్ గా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఏఆర్ రెహమాన్ పెద్దికి కొట్టి తన సత్తా మళ్ళీ చాటినట్టు తన బలమేంటో బక్కోడు (ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు) మళ్ళీ ప్రపంచానికి చూపించాలి. అరడజను సినిమాల్లో కనీసం మూడు వర్కౌట్ అయినా చాలు నిర్మాతల క్యూ అలాగే కొనసాగుతుంది.

Related Post

శివాజీ… టాక్ ఆఫ్ ద టౌన్శివాజీ… టాక్ ఆఫ్ ద టౌన్

ఈ ఏడాది ‘కోర్ట్’ మూవీతో సినీ రంగంలోకి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు శివాజీ. అందులో మంగపతి పాత్రలో తన పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక తెలుగు నటుడు నెగెటివ్ రోల్‌లో ఈ మధ్య ఇచ్చిన బెస్ట్ పెర్ఫామెన్స్‌గా

అంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవంఅంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సిరీస్ కొనసాగిస్తూ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగిల్ వచ్చేసింది. సినిమా విడుదల ఇంకో ఇరవై రోజుల్లో ఉండగా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదని ఎదురు చూస్తున్న