hyderabadupdates.com movies తొమ్మిది రోజులే ఉంది భగత్ గారూ !

తొమ్మిది రోజులే ఉంది భగత్ గారూ !

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి 19కే రిలీజ్ కావాలని నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా అభిమానుల్లో కదలిక వచ్చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ నుంచి ఎప్పటికప్పుడు రియాక్షన్లు విశ్లేషించే పని చేసుకుంటూనే ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు, రీ రికార్డింగ్ మొదలైన వర్క్స్ లో టీమ్ చాలా బిజీగా ఉంది.

అయితే ఫ్యాన్స్ ఖంగారు పడుతున్న విషయం ఒకటుంది. ఇప్పటిదాకా రెండు పాటలు వచ్చాయి. టైటిల్ సాంగ్ కి మిశ్రమ స్పందన వచ్చింది. దేఖ్ లేంగే సాలాకు మొదట్లో హడావిడి కనిపించింది కానీ చికిరి చికిరి అంత మేజిక్ చేయలేదు. మూడోది కాలర్ ఏత్తరా అంటూ రేపు రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ ఇంకో రెండు మూడు రోజుల్లో సిద్ధం కావాలి. చివరి నిమిషం దాకా నానబెట్టేందుకు దీనికి ఓజికు ఉన్నంత హైప్ లేదు. అందుకే సరైన ప్లానింగ్ చాలా అవసరమవుతోంది.

మిగిలింది తొమ్మిది రోజులే. ఒకపక్క దురంధర్ రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ హోరెత్తిపోతున్నాయి. హైదరాబాద్ ఒకటే కాదు అన్ని మెయిన్ సెంటర్స్ లో టికెట్ల అమ్మకాలు చేసేస్తున్నారు. చాలా షోలు ఆల్రెడీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కు రాత్రి ప్రీమియర్లు ఉండకపోవచ్చు. అదే జరిగితే మరుసటి రోజు మార్చి 19 తెల్లవారుజాము నాలుగు నుంచి బెనిఫిట్ షోలు వేయొచ్చు. తెలంగాణలో లేకుండా ఏపీలో మాత్రమే టికెట్ హైక్స్ తీసుకునే అవకాశం ఉందట.

ఓపెనింగ్స్ విషయంలో ఎవరికీ డౌట్ లేదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఆసక్తి రెట్టింపు కావాలంటే సరైన కంటెంట్ వదలాలి. ఇప్పటిదాకా శ్రీలీల, రాశిఖన్నా, పార్తిబన్ పాత్రలను పోస్టర్లలో చూడటమే లైవ్ దర్శనం జరగలేదు. దాంతో పాటు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ ఉన్న పవన్ వేరియేషన్స్ ని జనంలోకి ఇంకా బాగా తీసుకెళ్లాలి. పబ్లిసిటీ ఎక్కువ చేయకపోయినప్పటికీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయనే నమ్మకంతో టీమ్ ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో.

Related Post

Thalapathy Vijay-Sangeetha: 5 Times when Jana Nayagan actor heartily praised his wifeThalapathy Vijay-Sangeetha: 5 Times when Jana Nayagan actor heartily praised his wife

Thalapathy Vijay and his wife Sangeetha Sornalingam recently made headlines after reports suggested that the couple might be heading for a divorce. After nearly 27 years of marriage, the superstar