hyderabadupdates.com movies తొమ్మిదేళ్ళుగా ‘బంధం’ .. పెళ్ళికి నో: హైకోర్టు సంచలన తీర్పు

తొమ్మిదేళ్ళుగా ‘బంధం’ .. పెళ్ళికి నో: హైకోర్టు సంచలన తీర్పు

తొమ్మిదేళ్లు సంబంధంలో ఉండి, పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై నమోదైన కేసును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు – తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ తాను కాలేజీ రోజుల నుండి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నామని ఓ యువతి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధంలో ఉండి, తర్వాత నిరాకరించాడని ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మద్రాస్ హైకోర్టులో దేవా విజయ్ పిటిషన్ వేశాడు. విచారణ జరిపిన హైకోర్టు పెళ్లి చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇద్దరు ప్రేమలో పడి, శారీరకంగా కలిశాక సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని వ్యాఖ్యలు చేసింది.

ఇద్దరి మధ్య శారీరక బంధం ప్రేమ వల్ల ఏర్పడిందా, వివాహం కోసం చూశారా, కేవలం ఆనందం కోసమే జరిగిందా అనేది వారికి మాత్రమే తెలుసంటూ, ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యమంటూ కేసును కొట్టివేసింది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని వెల్లడించింది. బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంటూ పేర్కొంది.

Related Post

‘Dhurandhar: The Revenge’ Races Past ₹1000 Crore Mark in Record Time‘Dhurandhar: The Revenge’ Races Past ₹1000 Crore Mark in Record Time

Dhurandhar: The Revenge has turned into a full-blown box office phenomenon, setting new benchmarks within just its first week of release. The action-packed spy thriller, directed by Aditya Dhar, has