hyderabadupdates.com movies త్రిషపై నోరు జారి.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు

త్రిషపై నోరు జారి.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు

తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు విజయ్‌కి మధ్య బంధం గురించి ఇటీవల ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. విజయ్ విడాకులకు త్రిషనే కారణమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఇటీవల విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరు కావడం చర్చనీయాంశం అయింది. దీంతో త్రిష మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా గట్టిగా జరుగుతోంది.

ఇలాంటి టైంలోనే సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్.. ఒక సినీ వేడుకలో త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. స్టేజ్ మీద ఆయన మాట్లాడుతుండగా.. వెనుక ఉన్న స్క్రీన్ మీద త్రిష ఫొటో డిస్‌ప్లే అయింది. త్రిషను ఉద్దేశించి పార్తీబన్ మాట్లాడుతూ.. ‘‘ఆమె కొన్ని రోజులు ఇంట్లోనే ఉండడం మంచిది. ఆమె బయటికి వస్తే లేని పోని సమస్యలు వస్తున్నాయి’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆడిటోరియం హోరెత్తింది.

ఐతే ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదు, మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది. విజయ్, త్రిష ఫ్యాన్స్ కూడా పార్తీబన్‌ను ఎటాక్ చేశారు. ఈ నేపథ్యంలో పార్తీబన్ స్పందించారు. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జరిగిందంతా తప్పుగా భావిస్తున్నారని.. అలాంటపుడు తనకు క్షమాపణలు చెప్పడం తప్ప వేరే మార్గం లేదని పార్తీబన్ పేర్కొన్నారు. అంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లయింది.

Related Post

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ ‘ఎల్ మెంచో’ కథ ముగిసింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఒక భారీ సైనిక ఆపరేషన్‌లో ఇతను తీవ్రంగా గాయపడి మరణించినట్లు మెక్సికో రక్షణ

మురారి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలిమురారి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి

అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు పోటీలో ఉండటం వల్ల ప్రమోషన్ల పరంగా ఎవరికి వారు నువ్వా నేనానే రీతిలో ప్లాన్ చేసుకుంటున్నారు. రాజా సాబ్ హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తే మన