hyderabadupdates.com Gallery త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు post thumbnail image

కర్నూలు జిల్లా : త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌క‌టించారు. విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీపరంగా కురబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలులో జరిగిన కురబల ఆత్మీయ సమావేశంలో ఎంపీ బత్తిపాటి నాగరాజుతో కలిసి ఆమె పాల్గొని ప్రసంగించారు. ఐక్యతతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యతోనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని, కురబలు తమ బిడ్డలకు ఉన్నత విద్యలు అభ్యసించేలా ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియ చేశారు, అధికార పార్టీగా కురబల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడమే కాకుండా, శాశ్వత జీవో కూడా ఇచ్చామన్నారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదే విషయమై ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు వెల్ల‌డించారు. గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కురబలకు ప్రాధాన్యమిచ్చేలా చర్య లు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురబలు జిల్లాలు, మండలాల వారీగా తక్షణమే కుల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ నియామకానికి ఆసక్తి కలిగిన వారు తమ పేర్లు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా కురబ రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షునిగా ఎస్.కే. మల్లికార్జున, గౌరవ అధ్యక్షుడిగా తట్టే అర్జునరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా కర్నూలు శ్రీనివాసరావు, మదనపల్లి లక్ష్మన్న, గుంటూరు సత్యనారాయణ రాజు, నంద్యాల శ్రీరాములు, జనరల్ సెక్రటరీగా ఏలూరి సూర్యనారాయణ, కోశాధికారిగా సంతల శ్రీరాములును అందరి సూచన మేరకు ఎంపిక చేశారు.
కార్యదర్శులుగా మహేంద్ర (కర్నూలు), చెన్నప్ప (కొత్తచెరువు), దోనస్వామి (అనంతపురం), వెంకటేశ్వరరావు (మచిలీపట్నం), రఘు (రాయచోటి), కాంతారావు (పీలేరు), ప్రచార కార్యదర్శులుగా ఆదోని సంతోష్, పెనుకొండ రామాంజినేయులు, తిరుపతి శ్రీనివాసులు, బాపట్ల పరమేశ్వరరావు, బక్క రామకృష్ణను ఎంపిక చేశారు. ఎంపికైన వారు కురబల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
The post త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌Amit Shah: హిడ్మా ఎన్‌ కౌంటర్‌ పై అమిత్‌ షా డెడ్‌లైన్‌

    అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు.

Google: విశాఖలో గూగుల్‌ డేటాసెంటర్‌Google: విశాఖలో గూగుల్‌ డేటాసెంటర్‌

Google : విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిల్లీలో గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదర్చుకుంది. తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ,

Rajasthan: రాజస్థాన్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ! 15 మంది సజీవదహనం !Rajasthan: రాజస్థాన్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం ! 15 మంది సజీవదహనం !

Rajasthan : రాజస్థాన్‌ లోని జైసల్మేర్‌ లో మంగళవారంనాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ (Jodhpur) వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 మంది సజీవదహనమయ్యారు. మరో