hyderabadupdates.com movies థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో అసంతృప్తి కలిగిస్తోంది. ఎందుకంటే పెద్ద తెరమీద తమకు ఇష్టమైన నటీనటులను, కంటెంట్ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ అక్షరాల్లో స్క్రీన్ కింద ఉప శీర్షికలు రావడం ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మాస్ సెంటర్స్ జనాలు కంప్లయింట్ చేసినా ఆశ్చర్యం లేదు.

నిజానికి సబ్ టైటిల్స్ కల్చర్ కొత్తది కాదు. విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నదే. మూగ, చెవిటితనం ఉన్న ప్రత్యేక దివ్యాంగులు కూడా సినిమాలు చూడాలన్న ఉద్దేశంతో విదేశాల్లో ఎప్పటి నుంచో దీన్ని అమలు చేస్తున్నారు. మన దేశంలో డివిడి వీడియో డిస్కుల మార్కెట్ మొదలయ్యాక తెలుగు ప్రేక్షకులకు వీటి గురించి అర్థమయ్యింది. కాకపోతే వాటిని అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకునే సౌకర్యం డివిడి ప్లేయర్లలో ఉండటంతో అదో సమస్యగా భావించే వాళ్ళు కాదు.

కానీ ఇప్పుడలా కుదరదు. సబ్ టైటిల్స్ భరించాల్సిందే. చాలా మల్టీప్లెక్సుల్లో కొన్ని సంవత్సరాలుగా ఇది అమలులో ఉంది. వెళ్ళేది ఎలాగూ ఎక్కువ శాతం చదువుకున్న జనాలే కాబట్టి అదేం ఇష్యూ కాలేదు. వెబ్ సిరీస్ లలో చూసినట్టుగా ఈ ఉప శీర్షికలను బిగ్ స్క్రీన్ మీద చూడటం కష్టమే. రిపీట్ ఆడియన్స్ విషయంలో ఇది ప్రభావం చూపిస్తుంది. థియేటర్ కొచ్చిన పబ్లిక్ లో సగానికి పైగా ఓపిగ్గా ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునేంత చదువు ఉండకపోవచ్చు.

అలాంటప్పుడు కొందరి సౌకర్యం కోసం అందరి ఆనందాని బ్రేక్ వేయాలా అనేదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. సబ్ టైటిల్స్ ఎఫెక్ట్ ఎంత మోతాదులో ఉంటుందనేది ఇంకొంత కాలం ఆగితే కానీ క్లారిటీ రాదు. అంటే ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ రివెంజ్ లను కూడా సబ్ టైటిల్స్ లోనే చూడాల్సి ఉంటుంది. అయినా ఇప్పుడేదో కొంత వ్యతిరేకత కనిపించవచ్చు కానీ తర్వాత అలవాటైపోతే ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవని ప్రభుత్వాలు భావించవచ్చు. అయినా విజువల్ గా ఒక సినిమాని ఎంజాయ్ చేస్తున్నప్పుడు దారి పొడవునా అక్షరాలు అడ్డం వస్తుంటే ఓకే అనుకునేవాళ్లు ఎంతమంది ఉంటారో.

Related Post

Chase Stokes’ Cryptic Post Sparks Breakup Rumors: What’s Really Going On With Kelsea Ballerini?Chase Stokes’ Cryptic Post Sparks Breakup Rumors: What’s Really Going On With Kelsea Ballerini?

The speculation intensified after a video of them dancing in the streets of Dubrovnik went viral. However, Chase’s recent Instagram posts suggest the relationship, romantic or otherwise, may be definitively

Maxton Hall Season 2 Episode 5: What to Expect and How to Watch on Prime VideoMaxton Hall Season 2 Episode 5: What to Expect and How to Watch on Prime Video

Here’s what to expect in episode 5 Episode 5 promises to be an intense chapter in the series. Ruby and James are expected to rekindle their relationship following the cliffhanger