hyderabadupdates.com Gallery దంప‌తుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు

దంప‌తుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు

దంప‌తుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు post thumbnail image

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ఉత్త‌ర ప్ర‌దేశ్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 33 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడడ‌మే కాకుండా వీడియోలు తీయ‌డం, ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌చ్చారు మాజీ ఇంజనీర్ దంపతులు. ఇందుకు సంబంధించి కేసు న‌మోదైంది. శ‌నివారం కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. తుది తీర్పును వెలువ‌రించింది. ఈ సంద‌ర్బంగా ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. రోజు రోజుకు మాన‌వీయ విలువలు దిగ‌జారి పోతున్నాయ‌నే దానికి ఈ జంట ఓ ఉదాహ‌ర‌ణ అని పేర్కొంది. కేసుకు సంబంధించి దంపతులకు మరణశిక్ష విధిస్తూ ఉత్తర ప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు వెలువ‌రించింది.
ఇదిలా ఉండ‌గా 2010 – 2020 మధ్య పది సంవ‌త్స‌రాల‌లో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డారు మాజీ ఇంజనీర్ దంపతులు. రామ్ భవాన్ చిత్రకూట్ జిల్లాలో నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పని చేసిన నిందితుడు తన భార్య దుర్గావతితో కలిసి దారుణ ఆకృత్యాలకు ఒడిగట్టాడు. ఈ ఆకృత్యాలకు సంబంధించిన 2 లక్షల వీడియోలు, ఫోటోలు తీసి ఇంటర్నెట్ ద్వారా 47 దేశాలకు సరఫరా చేశాడు. భారీ ఎత్తున డ‌బ్బులు మూట‌గ‌ట్టుకున్న‌ట్లు తేలింది. ఇదిలా ఉండ‌గా ఆన్ లైన్ వీడియో గేమ్స్, కానుకల పేరుతో పిల్లలను మభ్యపెట్టాడు. ఆపై ఇంటికి తీసుకెళ్లి దారుణాలకు ఒడిగట్టారు ఈ దంప‌తులు. బాధితుల్లో మూడేళ్ల వయసున్న చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులపై 2020 అక్టోబర్‌లో సీబీఐ కేసు నమోదు చేయగా.. మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది ఉత్తర ప్రదేశ్ పోక్సో కోర్టు.
The post దంప‌తుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన యూపీ పోక్సో కోర్టు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Konda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీKonda Surekha: సీఎం రేవంత్‌ రెడ్డితో కొండా దంపతుల భేటీ

Konda Surekha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ భేటీ అయింది. ఈ దీపావళి పండుగ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి వెళ్లారు. పీసీసీ

మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలిమళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, పసుపు జెండా మోసిన వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వ‌మే రాష్ట్రంలో

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు