hyderabadupdates.com Gallery దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..?

దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..?

దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..? post thumbnail image

శ్రీ‌లంక : అస‌లైన పోరాటానికి వేదిక కానుంది శ్రీ‌లంక దేశ రాజ‌ధాని కొలంబో న‌గ‌రం. ఇప్ప‌టికే కోట్లాది మంది దాయాదుల మ‌ధ్య జ‌రిగే కీల‌క‌మైన మ్యాచ్ కోసం ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్నారు. త‌ట‌స్థ వేదిక‌గా దుబాయ్ లో జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై గెలుపొందింది. ఆ త‌ర్వాత ఆసియా క‌ప్ విజేత‌గా నిలిచింది. ఇందులో భాగంగా ఆదివారం ఇరు జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 మెగా టోర్నమెంట్ ను నిర్వ‌హిస్తున్నాయి. టోర్నీ ప్రారంభం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ జ‌ట్లు స‌సేమిరా అన్నాయి. ఇండియాలో ఇండియాతో ఆడే ప్ర‌స‌క్తి లేదంటూ మారాం చేశాయి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు.
దీంతో ఐసీసీ అటు పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాయి. అంతే కాకుండా ఐసీసీ టోర్నీలో తాము ఆడ‌బోమంటూ ప్ర‌క‌టించాయి. దీనిని సీరియ‌స్ గా తీసుకుంది ఐసీసీ. ఈ మేర‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మ‌రో వైపు అంత‌ర్జాతీయ స్థాయిలో ఆయా జ‌ట్ల‌తో , క్రికెట్ బోర్డుల‌తో ఒప్పందాలు చేసుకు్న కార్పొరేట్, దిగ్గ‌జ కంపెనీల‌న్నీ తీవ్ర ఒత్తిడి తీసుకు వ‌చ్చాయి. లేక పోతే త‌మ‌కు ముంద‌స్తు చేసుకున్న అగ్రిమెంట్ ప్ర‌కారం రూ. 300 కోట్ల‌కు పైగా చెల్లించాలంటూ వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆయా బోర్డులు దారికి వచ్చాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ తో ఆడేందుకు దాయాది పాకిస్తాన్ ఒప్పుకుంది. ఇవాళ ఇరు జ‌ట్లలో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై టెన్ష‌న్ కొన‌సాగుతోంది.
The post దాయాదుల పోరులో ‘దాదా’ ఎవ‌రో ..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దుఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ప్ర‌యాణీకుల‌కు. ప్ర‌స్తుతం ఇరాన్ ప్ర‌భుత్వం త‌మ గ‌గ‌న త‌లాన్ని మూసి వేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌కు ప్ర‌యాణం చేసే, ముంద‌స్తు బుకింగ్ చేసుకున్న ట్రావెల‌ర్స్

ఆ స‌మ‌యంలో జుబీన్ గార్గ మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడుఆ స‌మ‌యంలో జుబీన్ గార్గ మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడు

సింగ‌పూర్ : అస్సాంకు చెందిన ప్ర‌ముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగ‌పూర్ లో త‌న క‌చేరి నిర్వ‌హించేందుక‌ని వెళ్లి అనుమానాస్ప‌ద మృతికి గుర‌య్యాడు. ఇందుకు సంబంధించి విచార‌ణ‌కు ఆదేశించింది ఆ రాష్ట్ర స‌ర్కార్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

    బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా