hyderabadupdates.com movies దిల్ రాజు మెగా ప్లానింగ్

దిల్ రాజు మెగా ప్లానింగ్

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆశించిన విజయాలు అందుకోలేదు. సక్సెస్ రేట్ పడిపోయింది. భారీ చిత్రమైన ‘గేమ్ చేంజర్’తో పాటు ఫ్యామిలీ స్టార్, తమ్ముడు లాంటి మిడ్ రేంజ్ మూవీస్ కూడా ఆయన్ని దారుణంగా దెబ్బ కొట్టాయి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కాపాడకపోయి ఉంటే రాజు ప్రొడక్షన్ హౌస్ పునాదులే కదిలిపోయేవి. అలా అని రాజు ప్రొడక్షన్లో నెమ్మదించడం లేదు.

కొంచెం గ్యాప్ తర్వాత పెద్ద సినిమాల ప్లానింగ్ గట్టిగానే జరుగుతోంది రాజు బేనర్లో. ఇటీవలే ‘ఓజీ’ డిస్ట్రిబ్యూషన్‌తో మంచి ఫలితం అందుకున్న రాజు.. పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ తర్వాత మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందంటున్నారు. పవన్ వీలు చేసుకుని డేట్లు సర్దుబాటు చేయడమే ఆలస్యం.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతుంది. కానీ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో మునిగిపోయి ఉన్న పవన్ ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కష్టమే అనిపిస్తుంది.

మరోవైపు ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుంచి ఓ సినిమా చేయాలని రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. వీరి కలయికలో ఒకప్పుడు ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మున్నా’ సినిమాలు వచ్చాయి. కానీ ‘బాహుబలి’తో ప్రభాస్ రేంజ్ మారిపోయాక సినిమా రాలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాను పట్టాలెక్కించాలని రాజు ప్రయత్నిస్తున్నాడు. కథ, దర్శకుడి విషయంలో ప్రస్తుతం జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇంకోవైపు రాజు.. బాలీవుడ్లో రెండు సినిమాలకు సన్నాహాలు చేస్తున్నాడు. అందులో ఒకటి.. సంక్రాంతికి వస్తున్నాం రీమేక్. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు కానీ అలాంటిది ఏమి లేదు అనేది బాలీవుడ్ మీడియా టాక్. అఫిషియల్ క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. మరోవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా ప్లానింగ్‌లో ఉంది. త్వరలోనే దీని గురించి క్లారిటీ వస్తుంది. ఇక తమిళంలో విజయ్‌తో ‘వారిసు’ తీసిన రాజు.. మరో టాప్ స్టార్ అజిత్‌తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. త్వరలోనే దీని గురించి కూడా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ఈ ప్లానింగ్ చూస్తుంటే.. వచ్చే ఏడాది రాజు నుంచి వరుసగా మెగా మూవీస్ రాబోతున్నాయన్నమాట.

Related Post

ప్రభాస్.. హను.. కలర్ మారిపోయిందిప్రభాస్.. హను.. కలర్ మారిపోయింది

ప్రభాస్ సినిమా అంటే ఏదీ ఆషామాషీగా ఉండదు. ‘బాహుబలి’ తర్వాత తన ఇమేజ్ మారిపోవడంతో అతను మామూలు సినిమాలు చేసే పరిస్థితి లేదు. కథలో భారీతనం ఉంటుంది. బడ్జెట్లు భారీగా ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీయిన్లందరూ కూడా పెద్ద స్థాయి వాళ్లే ఉంటారు. విజువల్స్ వేరే