hyderabadupdates.com movies దిల్ రాజు లైనప్… భారీ అంచనాల మధ్య రిస్కీ ప్లాన్స్

దిల్ రాజు లైనప్… భారీ అంచనాల మధ్య రిస్కీ ప్లాన్స్

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడతారని పేరుంది. కానీ 2026 లైనప్ గమనిస్తే మాత్రం దిల్ రాజు భారీ రిస్కులు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పెద్ద స్టార్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నా.. ఆ కాంబినేషన్లలో ఉన్న కొన్ని రిస్కులు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. క్రేజ్ ఉన్న హీరోలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఇవన్నీ కత్తి మీద సాము లాంటివే అని చెప్పాలి.

విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘రౌడీ జనార్దన’ సినిమాపై ఇప్పటికే ఒక గ్లింప్స్ వచ్చింది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రా అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా విజయ్ కు చాలా కీలకం. విజయ్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన ప్రతీసారి ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఈ రక్తపాతం.. యాక్షన్ విజయ్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందనేది వేచి చూడాలి. విజయ్ లోని రౌడీ ఇమేజ్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయాల్సిందే.

మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా వస్తున్న ‘యల్లమ్మ’. ‘బలగం’ సినిమాతో వేణు తన సత్తా ఏంటో నిరూపించారు. అయితే దేవిని హీరోగా పెట్టి వేణు చేస్తున్న ఈ ప్రయోగం ఊహించని రిస్క్ అని చెప్పాలి. బజ్.. క్యూరియాసిటీ బాగున్నా.. ఆడియన్స్ దేవిని హీరోగా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే దానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి అంచనాలు తప్పితే ఫలితం దారుణంగా ఉండే అవకాశం కూడా ఉంది.

దిల్ రాజు బాలీవుడ్ పై కూడా గట్టిగానే ఫోకస్ పెట్టారు. వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేయబోతున్నారు. అనీస్ బజ్మీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ కు ఈ మధ్య కాలంలో వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి. అనిల్ రావిపూడి లేనిదే ఆ కామెడీ టైమింగ్ మళ్ళీ రీమేక్ లో వర్కవుట్ అవుతుందా లేదా అనే డౌట్స్ ఉన్నాయి. సక్సెస్ ట్రాక్ లో లేని హీరోతో రీమేక్ చేయడం దిల్ రాజు తీసుకుంటున్న మరో సాహసం.

అన్నింటికంటే పెద్ద రిస్క్ సల్మాన్ ఖాన్.. వంశీ పైడిపల్లి కాంబినేషన్. సల్మాన్ ఖాన్ నుండి ఒక సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమైంది. హిందీ ఆడియన్స్ కూడా పాత తరహా కమర్షియల్ సినిమాలను ఈ మధ్య తిరస్కరిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఫార్మాట్ దర్శకుడిగా పేరున్న వంశీ పైడిపల్లి.. సల్మాన్ తో ఎలాంటి కంటెంట్ చేస్తారనేది సస్పెన్స్.

వంశీ తన మేకింగ్ స్టైల్ మార్చుకుని కొత్తగా ఏదైనా ట్రై చేస్తే తప్ప ఈ కాంబో గట్టెక్కడం కష్టం. దిల్ రాజు లైనప్ లో సినిమాలు భారీగానే ఉన్నాయి. కానీ ప్రతీ ప్రాజెక్ట్ ఒక సవాల్‌తో కూడుకున్నదే. కంటెంట్ పరంగా గట్టి దమ్ము ఉంటే తప్ప ఈ కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద నిలబడవనే కామెంట్స్ వస్తున్నాయి. నిర్మాతగా దిల్ రాజు వేస్తున్న ఈ లెక్కలు ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతాయో చూడాలి. 

Related Post

‘అవతార్‌’ను ఇంత లైట్ తీసుకున్నారేంటి?‘అవతార్‌’ను ఇంత లైట్ తీసుకున్నారేంటి?

16 ఏళ్ల కిందట వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ కథకు, ఆ విజువల్స్‌కు, ఆ ఎఫెక్ట్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్ల రికార్డును అందించారు. ఆ చిత్రం సాధించిన