hyderabadupdates.com Gallery దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కం వికలాంగుల‌కు వ‌రం

దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కం వికలాంగుల‌కు వ‌రం

దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కం వికలాంగుల‌కు వ‌రం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క‌మైన సంక్షేమ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. రాష్ట్రంలోని దివ్యాంగుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు వారికి ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించేందుకు గాను దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కాన్ని బుధ‌వారం అధికారికంగా ప్రారంభించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వికలాంగుల‌కు ఇచ్చిన హామీని తాము నెర‌వేర్చిన‌ట్లు తెలిపారు సీఎం.
ఇదిలా ఉండ‌గా మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు బస్సులో ప్రయాణం చేశారు. సుమారు 11 కిమీ మేర దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించ‌డం విశేషం. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు. సీఎం క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగ శక్తి పథకం లబ్దిదారులుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ మాటామంతీ నిర్వ‌హించారు.
ఇదిలా ఉండ‌గా క్యాంప్ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగులను అందరినీ ఆప్యాయంగా పలకరించారు ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు సీఎంతో పాటు నారా లోకేష్‌. ఈ సంద‌ర్బంగా త‌మ‌కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు దివ్యాంగులు.
The post దివ్యాంగ శ‌క్తి ప‌థ‌కం వికలాంగుల‌కు వ‌రం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శIPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ

IPS Suicide : హరియాణాకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య (IPS Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య, ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దంవ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం

ముంబై : కోట్లాది మంది భార‌తీయులు ఇవాళ ముంబై వేదిక‌గా జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భార‌త్ ను సెమీస్ చేర్చిన సంజూ శాంస‌న్ పై

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులుPawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులు

    అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ… విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న ‘గూడెం’ గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల కృషితో