hyderabadupdates.com Gallery దురంధ‌ర్ -2 అదుర్స్ ఆదిత్య ధ‌ర్ సూప‌ర్

దురంధ‌ర్ -2 అదుర్స్ ఆదిత్య ధ‌ర్ సూప‌ర్

దురంధ‌ర్ -2 అదుర్స్ ఆదిత్య ధ‌ర్ సూప‌ర్ post thumbnail image

ముంబై : బాలీవుడ్ న‌టి, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ య‌జ‌మాని ప్రీతి జింతా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దురంధ‌ర్ సీక్వెల్ మూవీ దురంధ‌ర్ – 2 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దురంధ‌ర్ -1 రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వసూలు చేసింది. ఈ సంద‌ర్బంగా స్పందించింది ప్రీతి జింతా. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని పంచుకుంది . గురువారం ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇప్పుడే ధురందర్ 2 చూశాను. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, రివెంజ్ ఉంటే ధురందర్ లా ఉండాలి, లేకపోతే ఉండకూడదు అని పేర్కొంది ప్రీతి జింతా.
దర్శకత్వం, నటన, సంగీతం, ఎడిటింగ్, కథ, నటీనటుల ఎంపిక , ప్రతి ఇతర విభాగం కూడా అమోఘం అంటూ ప్ర‌శంస‌లు కురిపించింది. సినిమా చూసిన తర్వాత అమ్మ చెప్పిన మొదటి మాట, తన స్నేహితులతో కలిసి థియేటర్‌లో మళ్ళీ చూడాలన్నది. నాకు కూడా సరిగ్గా అలాగే అనిపిస్తోందని అని తెలిపింది. అంతే కాదు ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ ను ఆకాశానికి ఎత్తేసింది. ఆదిత్యా నన్ను మీ అభిమానిగా మార్చేశార‌ని పేర్కొంది. ఇంతటి అద్భుతమైన అనుభూతిని అందించినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపింది ప్రీతి జింతా. మీ నైపుణ్యం, మీ ప్రతిభ, అన్నింటికన్నా ముఖ్యంగా మీ మనసు చాలా మంచిది అని కితాబు ఇచ్చింది.
నా మనసు మీపై పడింది. ఎంత అద్భుతమైన నటన. ఎంతటి వైవిధ్యం, ఎంతటి లోతు, ఎంతటి నిజాయితీ. నా ఆలోచనలను వ్యక్తపరచడానికి ముందు, నేను ఇంకా ఈ విషయాన్ని జీర్ణించు కోవాల్సి ఉంది. ఈ మూవీలో న‌న్ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకున్న‌ది సారా అర్జున్ న‌ట‌న అని ప్ర‌శంసించింది.
The post దురంధ‌ర్ -2 అదుర్స్ ఆదిత్య ధ‌ర్ సూప‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rahul Gandhi: హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలుRahul Gandhi: హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

      బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో

TG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదంTG Cabinet: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్‌ ఆమోదం

    జీహెచ్‌ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న

కిమ్ వారసురాలిగా కిమ్ కూతురుకిమ్ వారసురాలిగా కిమ్ కూతురు

ఉత్త‌ర కొరియా : ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఆ దేశానికి కిమ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త‌న త‌దుప‌రి పాల‌కురాలిగా త‌న కూతురుగా కిమ్ జు ఏ కానుందా. అవున‌నే జ‌నం అంటున్నారు. దక్షిణ కొరియా