hyderabadupdates.com movies దురంధర్ 2… ఇక్కడితో ఆగడం లేదట

దురంధర్ 2… ఇక్కడితో ఆగడం లేదట

మార్చి 19 విడుదల కాబోతున్న దురంధర్ 2 ది రివెంజ్ మీద నెలకొన్న హైప్ ఎంతో మళ్ళీ చెప్పనక్కర్లేదు. దీని పంపిణి కోసమే జియో స్టూడియోస్ సంస్థ హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం కన్నా సెన్సేషన్ ఇంకేముంటుంది.

ఏపీ తెలంగాణ కలిపి ఎంతలేదన్నా వంద కోట్లకు పైగా గ్రాస్ వర్కౌట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ముందస్తు అంచనా వేస్తున్నాయి. అయితే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇది సాధ్యమే కానీ కాంపిటీషన్ లో ఉన్న టాక్సిక్ వల్ల వసూళ్లు ప్రభావితం చెందటం గురించి నిర్మాతల్లో కొంచెం టెన్షన్ లేకపోలేదు. దీన్నలా ఉంచితే దురంధర్ కి సంబంధించి మరో ఆసక్తికరమైన లీక్ చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ఈ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ రెండో భాగంతో ఆగిపోవడం లేదట. ఫస్ట్ పార్ట్ లో సస్పెన్స్ లో పెడుతూ వచ్చిన బడే సాబ్ ని క్లైమాక్స్ లో ప్రవేశపెట్టి అతనికి, రణ్వీర్ సింగ్ పోషించిన హంజా పాత్రకు మధ్య యుద్ధాన్ని ఫైనల్ అండ్ కంక్లూజన్ గా మూడో భాగంలో చూపిస్తారని ముంబై వర్గాల కథనం.

బడే సాబ్ గా ఇమ్రాన్ హష్మీ దాదాపు ఖరారేనని, దానికి సంబంధించిన షూట్ కూడా ఇటీవలే చేశారని అంటున్నారు. మరి దురంధర్ 2లో ఏముంటుందనే అనుమానం రావడం సహజం. పంజాబ్ కు చెందిన హంజా కుటుంబం ఎలాంటి దురాగతానికి బలయ్యిందో చూపిస్తూ దానికి ప్రతీకారం సీక్వెల్ లో ఉంటుందట.

అంటే హంజా జీవితం నాశనం కావడానికి దోహదం చేసిన వాళ్ళు పాకిస్థాన్ మాఫియా గ్యాంగ్ సభ్యులు కాబట్టి వాళ్ళను తుదముట్టించేందుకే మాధవన్ అడగ్గానే గూఢచారిగా వెళ్ళడానికి రణ్వీర్ సింగ్ ఒప్పుకున్నాడనేది అంతర్గతంగా వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం ఇవన్నీ స్పెక్యులేషన్ల దశలో ఉన్నాయి కాబట్టి నిజమని చెప్పలేం కానీ సంజయ్ దత్ ఈసారి ఎక్కువసేపు రచ్చ చేస్తారని వినిపిస్తోంది. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ రూపంలో వస్తున్న దురంధర్ 2లో దర్శకుడు ఆదిత్య దార్ భార్య, హీరోయిన్ యామిని ధార్ ఒక స్పెషల్ క్యామియో చేసిందని అంటున్నారు. చూడాలి నిజమో కాదో.

Related Post

Raj Tarun’s New Thriller Tortoise Launched with a Grand Pooja CeremonyRaj Tarun’s New Thriller Tortoise Launched with a Grand Pooja Ceremony

Tortoise, a new thriller starring Raj Tarun and Amrutha Chowdary, was launched today in Hyderabad with a traditional Pooja ceremony at Prasad Labs. The film is a joint production of