hyderabadupdates.com movies ‘దురంధర్’ సక్సెస్ వెనుక ఆమె

‘దురంధర్’ సక్సెస్ వెనుక ఆమె

దురంధర్, దురంధర్-2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రకంపనలు రేపాడు ఆదిత్య ధర్. కేవలం ఒక సినిమా అనుభవంతో అతను తెర మీద ఇలాంటి ఔట్ పుట్ తీసుకురావడం.. బాక్సాఫీస్‌ను ఇలా షేక్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే ఈ సక్సెస్ క్రెడిట్లో కొంత తన భార్య యామి గౌతమ్‌కు ఇవ్వాల్సిందే. ఆమె ‘దురంధర్-2’లో చిన్న క్యామియో రోల్ చేసింది. అందుకు ఆమెకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పెద్దగా పేరు లేని సమయంలోనే ఆదిత్యను నమ్మి అతడికి సపోర్ట్ చేసినందుకు ఆమెకు క్రెడిట్ ఇవ్వాలి.

ఆదిత్య తొలి చిత్రం.. యురి: ది సర్జికల్ స్ట్రైక్. ఆ సినిమా పరిమిత బడ్జెట్లో తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. ఐతే ఆ సినిమా మేకింగ్ టైంలోనే ఆదిత్యతో యామి ప్రేమలో పడింది. ఈ మూవీ రిలీజయ్యాక కొంత కాలానికి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆదిత్య అద్భుతాలు చేయగలడని యామి ముందే నమ్మింది.

అందుకే తాను అప్పటికే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ.. బడ్డింగ్ డైరెక్టర్ అయిన ఆదిత్య మీద నమ్మకముంచింది. తనకు అండగా నిలిచింది. అతడిని పెళ్లి కూడా చేసుకుంది. బాలీవుడ్లో ఆదిత్యకు పెద్దగా సపోర్ట్ లేకపోయినా.. యామి మాత్రం తనకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడతను ‘దురంధర్’, ‘దురంధర్-2’ చిత్రాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు. దేశవ్యాప్తంగా అతడి మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఒక వ్యక్తి పెద్ద విజయాలు అందుకున్నాక తన చుట్టూ అందరూ చేరతారు. కానీ అతను సాధారణ స్థాయిలో ఉన్నప్పుడే అండగా నిలిచి ప్రోత్సహించేవాళ్లు గొప్ప. యామి.. ఆదిత్యకు అలాగే అండగా నిలిచింది. ఆదిత్య గొప్ప స్థాయిలో లేనపుడే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు యామిని అందరూ కొనియాడుతున్నారు. ఇలాంటి సపోర్ట్ ఇస్తే అందరూ అద్భుతాలు చేస్తారని ఆమెను కొనియాడుతున్నారు

Related Post

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఈసారి వేలంటైన్స్ డేకి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ధనుష్‌తో ఎఫైర్

వ‌డివ‌డిగా ఉద్యోగాలు.. `కూట‌మి` లెక్క ఇదీ!వ‌డివ‌డిగా ఉద్యోగాలు.. `కూట‌మి` లెక్క ఇదీ!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌ల‌లో వ‌డివ‌డిగా ముందుకు సాగుతోంది. ఎక్క‌డ ఏ చిన్న అవ‌కాశం చిక్కినా.. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 21 మాసాల్లో ఏకంగా.. 6 ల‌క్ష‌ల