hyderabadupdates.com movies దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే పోటీ పడే రేంజులో ప్రతి శుక్రవారం కొత్త కంటెంట్లు ఇస్తూనే ఉన్నాయి. సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు కూడా ధీటుగా కనిపిస్తున్నాయి. వాటిలో భాగంగా వచ్చిందే కుట్రమ్ పురిందవన్. అంటే తప్పు చేసినవాడు అని అర్థం వస్తుంది. మనకూ పరిచయమున్న పశుపతి ప్రధాన పాత్ర పోషించగా ఒక పల్లెటూరి లొకేషన్ లో మొత్తం షూటింగ్ చేశారు. సోషల్ మీడియాలో దీని గురించి పాజిటివిటీ బాగానే కనిపిస్తోంది. అంతగా చెప్పుకునేలా ఇందులో ఏముందో చూద్దాం.

ఫార్మసిస్ట్ గా రిటైర్ అయిన ఒక వ్యక్తి అనుకోకుండా ఒక వ్యక్తి హత్య కేసులో ప్రమేయంతో పాటు చిన్న పాప శవాన్ని ఇంట్లో దాచి పెట్టాల్సి వస్తుంది. పోలీసులు ఎంత వెతికినా క్లూస్ దొరకవు. గ్రామంలో కొన్నేళ్ల క్రితం మాయమైపోయిన మరికొందరు ఆడపిల్లల కేసుకు దీనికి లింక్ ఉందని భావించిన ఒక ఎస్ఐ దానికి తగ్గట్టు విచారణ చేయడం మొదలుపెడతాడు. అసలు ఈ మర్డర్లు చేసింది ఎవరు, అంత చిన్న ఊరిలో ఇలాంటి ఘోరాలు ఎలా జరిగాయనేది అసలు స్టోరీ. హంతకుడు ఎవరో చివరి దాకా గెస్ చేయడం కష్టమనేలా స్క్రీన్ ప్లే నడిపించిన దర్శకుడు సెల్వమణి మునియప్పన్ బోర్ కొట్టకుండా చేశాడు.

అయితే దృశ్యం ఛాయలు చాలా కన్పిస్తాయి. ఒక శవాన్ని మాయం చేసి దాని చుట్టూ ఫ్యామిలీ డ్రామా నడిపించడం అందులో నుంచే తీసుకున్నట్టు అర్థమవుతుంది. బడ్జెట్ లిమిటెడ్ గా పెట్టడంతో నిర్మాణంలో రాజీ పడ్డారు. కాకపోతే రాసుకున్న సబ్జెక్టులోనే పెద్దగా ఖర్చు లేదు కాబట్టి అలా బండి లాగించేశారు. ఈ సిరీస్ ని నిలబెట్టింది పశుపతే. ఇటీవలే బైసన్ లో తన పెర్ఫార్మన్స్ తో మెప్పించిన ఈ విలక్షణ నటుడు మరోసారి అలవోకగా ఒక సామాన్యుడి పాత్రలో జీవించేశారు. టెక్నికల్ గా కూడా పర్వాలేదనిపించే కుట్రమ్ పురిందవన్ చేతిలో టైం ఎక్కువగా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. పెద్దగా అంచనాలు లేకపోతే ఓకే అనిపిస్తుంది.

Related Post

Thennaadu Song | Bison Kaalamaadan | Dhruv, Anupama | Mari Selvaraj | Nivas K Prasanna | SatyanThennaadu Song | Bison Kaalamaadan | Dhruv, Anupama | Mari Selvaraj | Nivas K Prasanna | Satyan

“தென் நாட்டு தேசத்துல வாழும் கூட்டம் உழவாடும் கூட்டம் நண்டோடும் சேத்துக்குள்ள பாடும் கூட்டம் வித போடும் கூட்டம் பாடும் கூட்டம் பயிராடும் கூட்டம்” #Thennaadu Out Now!! https://youtu.be/OC8ufhB8Msg A @nivaskprasanna Musical @SatyanSinger #MariSelvaraj #BisonKaalamaadan #BisonKaalamaadanOnOct17 #BisonKaalamaadanFromDiwali