hyderabadupdates.com Gallery ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి

ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి

ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి post thumbnail image

అమరావతి : ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, స్థానిక మహిళలకు ఉపాధి కల్పను కృషి చేస్తామని వెల్లడించారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత పైవిధంగా స్పందించారు. ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మెగా క్లస్టర్ ఏర్పాటుతో స్వల్పకాలంలో ఏడు వేల మందికి, దీర్ఘ కాలంలో 15 వేల మందికి..ఇలా 22 వేల మంది మహిళలకు ఉపాధి కలుగనుందన్నారు.
ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తో శ్రీసత్యసాయి, అనంతపురం మహిళలకు ఎంతో లబ్ధి కలుగనుందన్నారు. ఇటీవల నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అందించనున్నామని, దీనిలో భాగంతో అనంతపురంలో సర్వే నిర్వహించామని తెలిపారు. ఈ సర్వేలో స్వల్ప సంఖ్యలో చేనేతలు ఉన్నట్లు గుర్తించామన్నారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. దీనిలో భాగంగా అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, ఆ నియోజక వర్గ మహిళలకు అండగా నిలుస్తామని మంత్రి సవిత తెలిపారు.
The post ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టంశ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం అదృష్టం

తిరుమ‌ల : శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో

YV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణYV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ

  తిరుమల శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ పూర్తయింది. గురువారం నాడు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు.

Lord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహంLord Shri Ram: రూ.లక్షన్నర నాణేలతో 18 అడుగుల శ్రీరాముడి విగ్రహం

      ఉత్తర్‌ప్రదేశ్‌ లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 18 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని లఖ్‌నవూలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఏర్పాటు చేశారు. దీనిని యూపీ ఉప ముఖ్యమంత్రి