hyderabadupdates.com Gallery ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్

ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్

ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్ post thumbnail image

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ మూవీ. తాజాగా దీనికి కొన‌సాగింపుగా దురంధ‌ర్ ది రివెంజ్ పేరుతో కొన‌సాగింపుగా దురంధ‌ర్ -2 వ‌చ్చింది. దీనిపై ఇవాళ స్పందించాడు ఆర్జీవి. తాను ప్రివ్యూ చూశాన‌ని, అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు. ఆపై దురంధ‌ర్ -2 చిత్రం నూత‌న సినిమా క్ర‌మానికి పుట్టుక లాంటిద‌ని పేర్కొన్నాడు. ఇక మూడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధురందర్ సీక్వెల్ మార్చి 19న గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
మొఘల్-ఎ-ఆజం నుండి షోలే వరకు ఇప్పటి వరకు వచ్చిన గొప్ప చిత్రాలన్నీ ఆదిత్య ధర్ తాజా చిత్రంతో పోలిస్తే “టీవీ సీరియల్స్” లాగా కనిపిస్తాయని ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తనకు ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదిక‌గా ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ‘ధురందర్ 2’ చూసిన తర్వాత, దాని అంచనా వసూళ్లు, ప్రేక్షకుల ఉత్సాహం, సామాజిక ప్రభావాలు, సినిమాటిక్ వ్యాకరణాన్ని బద్దలు కొట్టడం, అన్నింటికంటే ముఖ్యంగా మానసిక దృశ్య శ్రవణ ప్రభావం గ‌తంలో వ‌చ్చిన , టాప్ మూవీస్ ను అధిగ‌మించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇదిలా ఉండ‌గా ర‌ణ్ బీర్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టించిన దురంధ‌ర్ ఆశించిన దానికంటే అత్య‌ధిక సంఖ్య‌లో కాసుల‌ను కురిపించింది. బాలీవుడ్ లో వ‌సూళ్ల‌లో టాప్ లో నిలిచింది. రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.
The post ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదుKTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు

KTR : కాంగ్రెస్‌ పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సోమవారం బీఆర్కే భవన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్ (KTR).

Lawyer Rakesh Kishore: దేవుడే సీజేఐపై నాతో దాడి చేయించాడు – రాకేశ్‌ కిశోర్‌Lawyer Rakesh Kishore: దేవుడే సీజేఐపై నాతో దాడి చేయించాడు – రాకేశ్‌ కిశోర్‌

Lawyer Rakesh Kishore : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై కోర్టు రూమ్‌లో సోమవారం బూటు విసిరేసిన ఘటనపై న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ (Lawyer Rakesh Kishore) స్పందించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి చింతా లేదని తెలిపారు.

Anant Singh: జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టుAnant Singh: జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు

Anant Singh : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్‌సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దులార్‌చంద్‌ హత్య