hyderabadupdates.com Gallery న‌దుల అనుసంధానంతో త‌మిళ‌నాడుకు నీళ్లు

న‌దుల అనుసంధానంతో త‌మిళ‌నాడుకు నీళ్లు

న‌దుల అనుసంధానంతో త‌మిళ‌నాడుకు నీళ్లు post thumbnail image

త‌మిళ‌నాడు : న‌దుల అనుసంధానానికి మోదీ కృషి చేస్తున్నార‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కోయంబత్తూరులో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. అంత‌కు ముందు కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశ‌మ‌య్యారు. కోయంబత్తూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్ధులు హాజ‌ర‌య్యారు. నార్త్ నుంచి పోటీ చేస్తున్న వానతి శ్రీనివాసన్, కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్న అమ్మన్ కే. అర్జున్, సింగనల్లూర్ నుంచి పోటీ చేస్తున్న కేఆర్ జయరామన్, కౌండంబాలాయం నుంచి పోటీ చేస్తున్న అరుణ్ కుమార్, సూలూర్ నుంచి పోటీ చేస్తున్న కందస్వామి ఉన్నారు.
ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు నారా చంద్ర‌బాబు నాయుడు. తమిళనాడుతో ఏపీకి.. ఎన్టీఆర్ కు, తనకు ఉన్న అనుబంధాన్ని సమావేశంలో వివరించారు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీరిచ్చామని అన్నారు. నదుల అనుసంధానం జరిగితే గోదావరి నీళ్లను తమిళనాడుకు ఇవ్వవొచ్చని చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి జరుగుతోందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు సీఎం. మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లును అడ్డుకుని డీఎంకే సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలు తప్పు చేశాయ‌న్నారు. కేంద్రం ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేదన్నారు. డీఎంకే సహా ఇండి కూటమి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.
The post న‌దుల అనుసంధానంతో త‌మిళ‌నాడుకు నీళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్Amit Shah: పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్

    భారత్‌ పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే… వారి తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్‌ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎంసిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌నా కాలంలో అందినంత మేర క‌ల్వ‌కుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . శాస‌న స‌భ సాక్షిగా తీవ్ర

విప‌క్షాల నిర్వాకం కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హంవిప‌క్షాల నిర్వాకం కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : తెలంగాణ‌పై నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య గురించి నోరు మెద‌ప‌ని కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి ఉన్న‌ట్టుండి నిన్న లోక్ స‌భ‌లో వీగి పోయిన బిల్లు గురించి ప్ర‌స్తావించ‌డం ప‌ట్ల తెలంగాణ వాదులు ఆశ్చ‌ర్యం