hyderabadupdates.com Gallery నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం

నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం

నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పారే న‌దుల‌ను అనుసంధానం చేస్తామ‌ని, ప్ర‌తి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి..డయాఫ్రామ్ వాల్ ను నీట ముంచేశారని ఆరోపించారు. రూ.440 కోట్ల విలువైన డయాఫ్రం దెబ్బతిన్న‌ద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ దాని పునర్నిర్మాణం కోసం రూ.1000 కోట్లు ఖర్చు అవుతోందని అన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తామ‌న్నారు. పోలవరం ఎడమ కాలువతో వంశధారను అనుసంధానం చేసి ఉత్తరాంధ్రను సస్య శ్యామలం చేస్తామ‌న్నారు . అటు నల్లమల సాగర్ తోనూ అనుసంధానించి రాయల సీమకూ నీరు తరలిస్తామ‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
గోదావరి, కృష్ణా నదుల ద్వారా 5 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు .
కేవలం 200 టీఎంసీల వరద నీటిని నల్లమలసాగర్ కు తరలించి కరవును తరిమికొట్టాలన్నదే మా ప్రయత్నం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసినా మనం అభ్యంతరం చెప్ప లేద‌న్నారు. మన తెలుగు సోదరులే అక్కడా ఉన్నార‌ని, మనవాళ్లే నీళ్లు వినియోగించుకుంటే అందరికీ సంతోషమేన‌ని అన్నారు. వారు నీళ్లు వినియోగించుకున్నా ఏపీకి అభ్యంతరం లేద‌న్నారు. ఏపీలో ఉన్న జలాశయాలు, గొలుసు కట్టు చెరువులు అన్నీ నింపి మన రైతులకు, ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామ‌న్నారు. కరవును తరిమి కొట్టేలా కార్యాచరణ చేపడుతున్నాం అని, దానికి సాగునీటి సంఘాల ప్రతినిధులంతా సహకారం అందించాలని కోరారు.
The post నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2

Election Commission : ఓటరు జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌) రెండోదశను తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టనుంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్,

Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్

  అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌ లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్‌ యాదవ్‌పైనా,

YS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లుYS Jagan: జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనకు వైసీపీ విస్తృత ఏర్పాట్లు

    వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ జగన్‌ పర్యటన వివరాలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన వివరాల