hyderabadupdates.com movies నాని – నెట్ ఫ్లిక్స్ బంధం చాలా స్ట్రాంగ్

నాని – నెట్ ఫ్లిక్స్ బంధం చాలా స్ట్రాంగ్

న్యాచురల్ స్టార్ నాని అంటే బయ్యర్ వర్గాల్లో, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ లో ఎంత నమ్మకముందో తెలిసిందే. ఇప్పుడీ ట్రస్ట్ ఓటిటిలకూ వెళ్ళిపోయింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థ ఇతర హీరోలతో ఏమో కానీ నాని కొత్త సినిమా అంటే చాలు పోటీ పడి మరీ ఆఫర్లు ఇచ్చి ఎగరేసుకుని పోతోంది.

తాజాగా విడుదల చేసిన ఈ కంపెనీ ఆఫ్టర్ థియేటర్ లిస్టులో ది ప్యారడైజ్ ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వయొలెంట్ డ్రామా మార్చి 26 విడుదలకు షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు విలన్ గా నటిస్తుండగా కయదు లోహర్ హీరోయిన్ గా మెరవనుంది.

అయితే నెట్ ఫ్లిక్స్ – నాని మధ్య బంధం ఎంత ధృడంగా ఉందో చెప్పడానికి ఇది ఏడో ఉదాహరణ. దీనికన్నా ముందు హిట్ 3 ది థర్డ్ కేస్, సరిపోదా శనివారం, హాయ్ నాన్న, దసరా, అంటే సుందరానికి, శ్యామ్ సింగ రాయ్ అన్నీ నెట్ ఫ్లిక్స్ కొనేసింది. వీటిలో చాలా మటుకు అత్యధిక వ్యూస్ తెచ్చుకుని కాసుల పంట కురిపించినవే.

నెక్స్ట్ లైన్ లో ఉన్న సుజిత్ – నాని మూవీ కూడా ఇదే ఖాతాలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. దీన్ని బట్టి నాని మార్కెట్ ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ప్రైమ్, హాట్ స్టార్ కాంపిటీషన్ దాటుకుని మరీ నెట్ ఫ్లిక్స్ ఇన్నేసి నాని సినిమాలు బుట్టలో వేసుకోవడం ఇతర హీరోలకు జరగలేదనే చెప్పాలి.

కేవలం డెబ్భై రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో ప్యారడైజ్ చెప్పిన డేట్ కి వస్తుందా రాదా అనే అనుమానాలు బలంగానే ఉన్నాయి. మార్చి 19 దురంధర్ 2, టాక్సిక్, డెకాయిట్ ఉన్నాయి. ఒక రోజు గ్యాప్ లో మార్చి 27 పెద్ది వస్తుంది. అయినా సరే ప్యారడైజ్ మేకర్స్ వాయిదాని ఒప్పుకోవడం లేదు.

ప్రమోషన్లలో మార్చి 26 అనే చెబుతున్నారు. ఒకవేళ దానికే కట్టుబడిన పక్షంలో పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటిదాకా టాలీవుడ్ చూడని షాకింగ్ క్యారెక్టరైజేషన్ ప్యారడైజ్ లో ఉంటుందని, నాని కెరీర్ బెస్ట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. ఆ స్థాయిలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఏం తీస్తున్నారో మరి.

Related Post

మాస్ రాజా టార్గెట్ ఎంత?మాస్ రాజా టార్గెట్ ఎంత?

మాస్ రాజా రవితేజ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా.. మాస్ జాతర. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో షాక్ తిన్న ఆయన.. కొంచెం గ్యాప్ తీసుకుని ‘మాస్ జాతర’ చేశాడు. ‘సామజవరగమన’తో రైటర్‌గా మంచి పేరు సంపాదించిన భాను