hyderabadupdates.com Celeb Gallery నారా వారి సారా..వైసీపీ నేతల ఫైర్

నారా వారి సారా..వైసీపీ నేతల ఫైర్

నారా వారి సారా..వైసీపీ నేతల ఫైర్ post thumbnail image

నకిలీ మద్యం కుంభకోణంపై స్పందించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. నారా వారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో అందరికి తెలిసిపోయింది అన్నారు. రూ.5,280 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి అన్నారు.

ములకలచెరువు సాక్షిగా, కృష్ణా జిల్లా సాక్షిగా జరిగిన అవినీతి బయటపడింది అని దుయ్యబట్టారు అవినాష్ రెడ్డి. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినా చీమ కుట్టినట్లు కూడా లేదు… కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు అవినాష్ రెడ్డి.

మరోవైపు కల్తీ మద్యం దందాపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో జే బ్రాండ్ మద్యం అని ఆరోపణలు చేశారు…మరి ఇప్పుడు ఈ నకిలీ మద్యం ఏ బ్రాండ్..? చెప్పాలన్నారు.

చంద్రబాబు బ్రాండా..? పీకే బ్రాండా..? ఎల్.కే. బ్రాండా..?…ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతలకు శిక్షణ ఇప్పించి తీసుకొస్తున్నారు అని ఆరోపించారు. మందు బాబులకు కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి ద్రోహం చేస్తోంది అని ఆరోపించారు నాని.

The post నారా వారి సారా..వైసీపీ నేతల ఫైర్ appeared first on Adya News Telugu.

Related Post