hyderabadupdates.com Gallery నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. రిషబ్ శెట్టి హీరోగా, అలాగే దర్శకుడిగానూ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ప్రీక్వెల్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివోషనల్ యాక్షన్ డ్రామా స్టైల్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్ల పరంగా కూడా బలమైన స్టార్ట్ సాధించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

రిలీజ్ డేలోనే ఈ సినిమా దాదాపు 18 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంది. అయితే రెండో రోజు మాత్రం ఊహించని విధంగా వసూళ్లు తగ్గిపోయాయి. సాధారణంగా నార్త్ లో వర్కింగ్ డే అయినప్పటికీ, సినిమాకి టాక్ బాగుంటే కలెక్షన్లు మెరుగ్గానే కొనసాగుతాయి. కానీ కాంతార ప్రీక్వెల్ కి మాత్రం మొదటి రోజు తో పోలిస్తే రెండో రోజు దాదాపు 5 కోట్ల వరకూ తగ్గిపోయాయి. దీంతో రెండో రోజు కలెక్షన్లు సుమారు 13.5 కోట్ల వద్ద ఆగిపోయాయి.

ఇక వీకెండ్ లోని శనివారం, ఆదివారం రోజుల్లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
The post నార్త్ లో డౌన్‌ అయిన కాంతారా వసూళ్లు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీCM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ

Mamata Banerjee : ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జల్‌పాయీగుడీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సోమవారం పర్యవేక్షించారు.

వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్

హైద‌రాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ

కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కేంద్ర మంత్రి జేడీ కుమార స్వామిపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త‌న గురించి లేని పోని కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బెంగ‌ళూరులో