hyderabadupdates.com movies నాలుగు గంటలంటే కొంచెం టెన్షనే

నాలుగు గంటలంటే కొంచెం టెన్షనే

బాహుబలి ది ఎపిక్ ఫైనల్ వెర్షన్ 3 గంటల 44 నిమిషాలకు లాక్ చేశారు. సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ వచ్చేసింది. ఇంకో పావు గంట ఇంటర్వెల్ కలుపుకుంటే మొత్తం 240 నిమిషాల పాటు థియేటర్లో గడపాల్సి ఉంటుంది. ఒకవేళ మల్టీప్లెక్సులు కనక అదనంగా యాడ్స్ వేసుకుంటే ఆ మేరకు సమయం మరింత పెరుగుతుంది. కానీ దీనికి ఛాన్స్ తక్కువ. ఎందుకంటే షోలు సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతుంది. ఒకపక్క అదే రోజు మాస్ జాతర రిలీజ్ ఉంది. వీటితో పాటు ముందు వారం వచ్చిన సినిమాలు కొనసాగుతూ ఉంటాయి. సో బాహుబలి ది ఎపిక్ టైంని మేనేజ్ చేసుకోవడం యాజమాన్యాలకు పెద్ద సవాలే.

ఎలా చూసుకున్నా ఒక స్క్రీన్ లో బాహుబలి ఎపిక్ నాలుగు కంటే ఎక్కువ షోలు వేయలేరు. పన్నెండు గంటల సమయం స్క్రీనింగ్ కు పోగా, మరో రెండు గంటలు క్లీనింగ్ వగైరా కార్యక్రమాలు ఉంటాయి. అర్ధరాత్రి తర్వాత పర్మిషన్లు ఉండవు కాబట్టి చివరి ఆట పదకొండు కల్లా వేసేయాలి. ప్రాక్టికల్ గా చిక్కులైతే ఉంటాయి. అభిమానులకు, మూవీ లవర్స్ కి నిడివి సమస్యే కాదు. బాహుబలి ప్రపంచాన్ని వెబ్ సిరీస్ లాగా అయిదారు గంటలు చూపించినా ఎంజాయ్ చేస్తారు. కానీ రెగ్యులర్ రేట్లకు టికెట్లు అమ్మిన థియేటర్లకు ఒక షో రెవిన్యూ తగ్గడమే కాక కరెంట్ బిల్లులు, ఏసీ ఖర్చులు మరింత ఎక్కువవుతాయి.

అలాని ఇంత లెన్త్ తో రన్ అయిన సినిమాలు లేవని కాదు. పుష్ప 2 ది రూల్ లేట్ రన్ లో కొత్త వెర్షన్ దాదాపు బాహుబలి ఎపిక్ అంత నిడివితోనే ఆడింది. కానీ అప్పటికే అధిక శాతం ప్రేక్షకులు చూసేసి ఉండటంతో మళ్ళీ పెద్దగా వసూళ్లు పెరగలేదు. కానీ ప్రభాస్ మూవీ పరిస్థితి అది కాదు. ఏది ఏమైనా ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. అందరూ రీ రిలీజులతో మొహం మొత్తేలా చేస్తుంటే తను మాత్రం ఏకంగా కొత్త సినిమాలే భయపడే రేంజ్ లో ఎపిక్ ని మార్కెటింగ్ చేస్తున్నారు. ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం కూడా అందులో భాగంగా చేస్తున్నదే. చూడాలి ఇంకేం సర్ప్రైజులు రాబోతున్నాయో.

Related Post

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలుఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం ప్రియుల్లో బడాబాబులు కూడా ఎంతో మంది ఉన్నారు. మందుబాబులు తీసుకునే లిక్కర్ వందల్లో ఉంటే, బడాబాబులు తాగే మద్యం ఖరీదు

Dulquer’s performance in Kaantha will shock you- SamuthirakaniDulquer’s performance in Kaantha will shock you- Samuthirakani

Actor and director Samuthirakani was all praise for Dulquer Salmaan after watching his performance in the upcoming film Kaantha. Speaking about the film, Samuthirakani said he was completely taken aback