hyderabadupdates.com movies ‘నిజాం చేసిన అభివృద్ధిని నాశనం చేశారు’

‘నిజాం చేసిన అభివృద్ధిని నాశనం చేశారు’

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదీ ప్రక్షాళనపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ నదీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని అన్నారు.

సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీరు ప్రవహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకే, ప్రపంచ స్థాయిలో కన్సల్టెన్సీ నిపుణులతో చర్చించి, మూసీ వంటి ప్రాజెక్టులను పరిశీలించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని అన్నారు.

గత పాలకులకు నిజాం మీద కోపం ఉంటే అభ్యంతరం లేదని, కానీ, వాళ్లు చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని అన్నారు. నిజాం కట్టిన చారిత్రక కట్టడాలను, అభివృద్ధిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కిందటే నిజాం నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్దారని, అప్పట్లోనే ప్రపంచ దేశాలతో పోటీ పడేలా హైదరాబాద్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారని గుర్తు చేశారు.

అయితే, రేవంత్ మాట్లాడిన తర్వాత తమకు మాట్లాడే అవకాశమివ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుమతించలేదు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడతానంటేనే మైక్ ఇస్తానని, ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు. దీంతో, స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

“హైదరాబాద్ రాష్టాన్ని ప్రపంచదేశాలతో పోటీపడే విధంగా ఆనాడు నిజాం అభివృద్ధి చేశాడు.పాలకులకు నిజాం మీద కోపం ఉంటే అభ్యంతరం లేదు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు.”– #RevanthReddy pic.twitter.com/1NXFPa6cD6— Gulte (@GulteOfficial) January 2, 2026

Related Post

Naga Chaitanya’s Fierce ‘Vrushakarma’ Look Goes ViralNaga Chaitanya’s Fierce ‘Vrushakarma’ Look Goes Viral

Actor Naga Chaitanya has stunned fans with his intense physical transformation for the upcoming mythological action drama Vrushakarma, as the makers released brand new behind-the-scenes (BTS) stills from the film.

అభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరుఅభిమానుల టెన్ష‌న్ తీర్చిన చిరు

70 ఏళ్ల వ‌య‌సులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవ‌ల మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు చిత్రంతో మెగా ఫ్యాన్స్ క‌ర‌వు తీర్చేశారు చిరు. ఆ సినిమాలో ఆయ‌న కామెడీ టైమింగ్, డ్యాన్సుల గురించి