hyderabadupdates.com movies నిద్ర లేదు.. ఆహారం తినాలని లేదు: పీకే ఆవేదన

నిద్ర లేదు.. ఆహారం తినాలని లేదు: పీకే ఆవేదన

ఆయన అనేక మంది నాయకులను చూశారు. అనేక పార్టీల గెలుపు ఓటములను కూడా దగ్గరగా పరిశీలించారు. అంతేకాదు ఒక పార్టీ గెలుపుకోసం పనిచేసి మరో పార్టీని ఓడించారు. ఇలా గత 10 సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రసాంత్ కిషోర్ ఉరఫ్ పీకే. అయితే ఆ అనుభవం తన దాకా వస్తే కానీ ఓటమిలో ఉన్న ఆవేదన ఆయనకు అర్థం కాలేదు. గెలుపు ఎప్పుడూ మజానే ఇస్తుంది. కానీ ఓటమి అనుకున్నంత ఈజీగా జీర్ణం కాదు. అది ఎవరైనా సరే. ఇప్పుడు ఇదే ఆవేదన ఆందోళన ప్రసాంత్ కిషోర్ విషయంలోనూ కనిపిస్తోంది.

తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. “బీహార్‌లో ఓడిపోతామని తెలుసు. కానీ ఇంత ఘోరంగా మాత్రం కాదని అనుకున్నా” అని అన్నారు. ఎన్నికల్లో ఇంత ఘోరంగా పరాజయం పాలవుతామని అస్సలు అనుకోలేదన్నారు. “కనీసం 5 సీట్లలో అయినా విజయం దక్కుతుందని అంచనా వేసుకున్నాం. మా లెక్కలు మాకు ఉన్నాయి. కానీ ఎక్కడో తేడా కొట్టింది” అని చెప్పారు. ఈ ఓటమిని తాను జీర్ణించుకోలేకపోతున్నానని, అందుకే నిద్ర పట్టడం లేదని పీకే తెలిపారు. “నిద్ర లేదు. ఆహారం కూడా తినాలని లేదు. ఏం చేస్తాం. ఎన్నో ఆశలు కుప్పకూలాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

గత మూడున్నరేళ్లుగా బీహార్ ప్రజలతో తాను టచ్‌లో ఉన్నానని పీకే చెప్పారు. వారి భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు రాశానని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే వచ్చే పదిేళ్లలో రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చాలని భావించానన్నారు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. ఇక తాను పెట్టుకున్న లక్ష్యంలో మూడున్నర సంవత్సరాలు ఇప్పటికే కరిగిపోయాయని పీకే చెప్పారు. అయినా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. కానీ ఎన్నికలు అంటే ఇంత దారుణంగా ఉంటాయని ఇప్పుడే అర్థమైందని తెలిపారు. (ఇది వాస్తవానికి చాలా ఆశ్చర్యకర వ్యాఖ్య. ఎందుకంటే పీకే 2014 నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేశారు. ఆయనకు గెలుపు ఓటములు గురించి తెలుసు.)

కాగా పీకే పార్టీ జన సురాజ్ గుర్తింపు ఇప్పట్లో లభించే అవకాశం లేదని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆ పార్టీకి 3.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని ఇది నిబంధనల ప్రకారం గుర్తింపు ఇవ్వడానికి సరిపోదని వ్యాఖ్యానించారు. 235 స్థానాల్లో పోటీ చేసిన జన సురాజ్ పార్టీ అభ్యర్థులు ఒక్కరూ విజయం సాధించలేదు. పైగా ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఈ ఎన్నికల్లో పీకే పోటీ చేయలేదు. ఇదే సమయంలో ఆయన్ను రెండు ఓట్లు ఉన్న వ్యవహారం కూడా ఎన్నికల సమయంలో వివాదంగా మారింది.

Related Post

ఆ ‘స్పీడ్’ ఏంటి బాబు గారు?ఆ ‘స్పీడ్’ ఏంటి బాబు గారు?

టీడీపీ అధినేత. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 అంటూ 2020లో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని ఆనాడే అంచనా వేసిన దార్శనీకుడు చంద్రబాబు. దేశవ్యాప్తంగా విజనరీ లీడర్ గా గుర్తింపు

Superstar Rajinikanth and this star director to team up for a hat-trick?Superstar Rajinikanth and this star director to team up for a hat-trick?

Kollywood stalwart Rajinikanth is currently working on the highly anticipated sequel to his blockbuster action drama, Jailer. The film is being directed by Kollywood star director Nelson. As per the