hyderabadupdates.com movies నీటిలోనే టెకీ ఆఖరి ఫోన్ కాల్

నీటిలోనే టెకీ ఆఖరి ఫోన్ కాల్

నోయిడాలో దట్టమైన మంచు కురుస్తున్న వేళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ కలిచివేస్తోంది. గుర్గావ్‌లో టెక్కీగా పనిచేస్తున్న 27 ఏళ్ల యువరాజ్ మెహతా, శుక్రవారం అర్ధరాత్రి తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం, అక్కడ కనీసం రిఫ్లెక్టర్లు కూడా లేకపోవడంతో అతని కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న ఒక భవనం తాలూకు 70 అడుగుల లోతైన నీటి గుంతలోకి దూసుకెళ్లింది.

కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో యువరాజ్ తన తండ్రికి ఫోన్ చేసి చేసిన ఆఖరి సంభాషణ గుండెలను పిండేస్తోంది. “నాన్నా.. నేను లోతైన నీటి గుంతలో పడిపోయాను, మునిగిపోతున్నాను.. ప్లీజ్ నన్ను కాపాడండి, నాకు చావాలని లేదు” అంటూ తండ్రిని వేడుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ సైలెంట్ అయిపోయింది. అటుగా వెళ్తున్న వారు అతని అరుపులు విని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

ప్రమాదం జరిగిన గంటన్నర వరకు యువరాజ్ ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే రెస్క్యూ టీమ్స్ ఆలస్యంగా స్పందించాయని బాధితుడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి కారును, యువరాజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే కొడుకు శవమై బయటకు రావడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణం పోయిందని, డ్రైనేజీలపై మూతలు లేకపోవడం, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి, ఆ లోతైన గుంతను చెత్త వ్యర్థాలతో నింపేసి చేతులు దులుపుకోవడం గమనార్హం.

బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు బిల్డర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీలపై అజాగ్రత్త వల్ల మరణానికి కారణమైనందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇంత లోతైన గుంతను వదిలేసినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.

Related Post

రజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడురజినీ కొడుకుగా… అందరూ మెచ్చినవాడు

కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవం వల్ల మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పెరిగిందో తెలిసిందే. ఎప్పట్నుంచో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నప్పటికీ.. మలయాళం ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది, అక్కడి సినిమాల విలువ అందరికీ తెలిసిందీ కరోనా

బొమ్మా బొరుసా… కోర్టు చేతిలో జీవోల బంతిబొమ్మా బొరుసా… కోర్టు చేతిలో జీవోల బంతి

ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై హైక్స్ ఉండవని మీడియా ముందు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. అందుకే ఈసారి నిర్మాతలు తెలివిగా తామే హైకోర్టు మెట్లు ఎక్కారు.

Hombale Films Announces ‘Mahavatar Parashuraam’, Powerful Glimpse Creates BuzzHombale Films Announces ‘Mahavatar Parashuraam’, Powerful Glimpse Creates Buzz

Leading production house Hombale Films has officially announced its next ambitious project, Mahavatar Parashuraam, on the auspicious occasion of Parashuram Jayanti. The banner, known for blockbuster films like KGF, Kantara,