hyderabadupdates.com movies నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది రజని దీని ప్రమోషన్ కోసం అరగంటకు పైగా ప్రత్యేకమైన వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. అది కూడా సినిమాలో వేసిన గెటప్ తో పాటు ఇవ్వడం అన్నింటి కన్నా పెద్ద ట్విస్టు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న రజనీకాంత్ ఒక పెద్ద బాంబు వేశారు. నరసింహ సీక్వెల్ చర్చల్లో ఉందని, నీలాంబరి పేరుతో తీసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. కానీ అర్థం కానీ విషయం ఏంటంటే క్లైమాక్స్ లోనే రమ్యకృష్ణ పోషించిన ఆ పాత్ర చనిపోయింది.

మరి ఇప్పుడు ఆ పేరుతోనే సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారేమో. కానీ నిజ జీవితంలో సౌందర్య బ్రతికిలేరు కాబట్టి ఆవిడ క్యారెక్టర్ కి ఏదో ఒక ముగింపు చూపించాలి. అలా కాకుండా నీలాంబరితో ఫ్రెష్ గా వేరే సబ్జెక్టుతో తీస్తామంటే జనాలు కనెక్ట్ కారు. పైగా దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్ మానేసి నటనకు పరిమితమయ్యారు. ఈ బాధ్యతను వేరేవాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. చూస్తుంటే రజని ఏదో ఫ్యాన్స్ కి కాస్త ఊపునిద్దామని ఆ మాట అన్నట్టు ఉంది కానీ నిజమయ్యే సూచనలు తక్కువే. రమ్యకృష్ణ ఎలాగూ ఉన్నారు కాబట్టి ఈ ప్లాన్ మంచిదే కానీ అంత గొప్పగా సీక్వెల్ వస్తుందన్న గ్యారెంటీ లేదు.

పడయప్ప ఇప్పటిదాకా ఏ ఓటిటికి అమ్మలేదు. ఆ మాట కూడా రజనీనే చెప్పారు. తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది కానీ తమిళ ప్రింట్ మాత్రం ఆన్ లైన్ లో లేదు. ఆ మధ్య వన్ టైం టెలికాస్ట్ కోసం సన్ టీవీ ఛానల్ కు హక్కులు అమ్మారు తప్పించి మళ్ళీ రిపీట్ చూద్దామన్నా ప్రేక్షకులకు ఆ ఛాన్స్ దొరకలేదు. నరసింహ కథ కూడా తనే రాశానని చెబుతున్న రజని ఇప్పుడీ రీ రిలీజ్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. యాభై సంవత్సరాల నట ప్రయాణం సందర్భంగా చేస్తున్న విడుదల కాబట్టి ఫ్యాన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాండ్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. చూడాలి ఎలాంటి రికార్డులు వస్తాయో.

Related Post

చేతులు జోడించి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌టిచేతులు జోడించి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌టి

దేవుడు, భ‌క్తితో ముడిప‌డ్డ విష‌యాల్లో లైన్ దాటితే తీవ్ర వివాదాలు త‌ప్ప‌వు. కొన్ని నెల‌ల కింద‌ట తిరుమ‌ల‌లో ప్రసాదం గురించి నోరు జారిన యాంక‌ర్ శివ‌జ్యోతి ఎంత వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొందో తెలిసిందే. క్ష‌మాప‌ణ‌లు చెప్పాక కూడా ఆమె మీద వ్య‌తిరేక‌త త‌గ్గ‌లేదు.

Musical promotions of Thalapathy Vijay’s Jana Nayagan to begin this weekendMusical promotions of Thalapathy Vijay’s Jana Nayagan to begin this weekend

Addressing the postponement rumors, the makers of Thalapathy Vijay’s Jana Nayagan released a poster stating that the movie will make it to the big screens on the initially announced January